ETV Bharat / sitara

రైతు పాత్రలో నందమూరి బాలకృష్ణ!

author img

By

Published : Jul 2, 2020, 5:31 AM IST

Updated : Jul 2, 2020, 11:36 AM IST

Nandamuri Balakrishna will playing a former role in his new movie
రైతుగా తెరపై కనువిందు చేయనున్న బాలయ్య!

అగ్రకథానాయకుడు బాలకృష్ణ.. తన కొత్త సినిమాలో రైతుగా కనిపించనున్నారట. దీనికి మాస్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించనున్నారని సమాచారం.

నటసింహం నందమూరి బాలకృష్ణ చేయని పాత్రలంటూ ఏమీ లేవు. కాలేజీ కుర్రాడిగా, పోలీస్‌ అధికారిగా, డాక్టర్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే తన కొత్త సినిమాలో రైతు పాత్ర పోషించనున్నారని సమాచారం.

ఈ ప్రాజెక్టుకు బి.గోపాల్​ దర్శకత్వంలో వహించనున్నారట. ఇంతకుముందు ఇదే డైరెక్టర్​తో బాలయ్య.. 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' లాంటి విజయవంతమైన చిత్రాలు చేశారు. ఇప్పుడు కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్​ను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

'గౌతమిపుత్ర శాతకర్ణి'కి సంభాషణలు రాసిన బుర్రా సాయిమాధవ్..‌ ఈ సినిమాకు పనిచేయనున్నారని సమాచారం. అయితే ఇందులోని నటీనటులు, సాంకేతివర్గం గురించి స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చూడండి... టీజర్​​: పంచె కట్టులో అదరగొట్టిన బాలయ్య

Last Updated :Jul 2, 2020, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.