ETV Bharat / sitara

ఒలింపిక్స్ విజేత​ మీరాబాయ్​ బయోపిక్ రెడీ

author img

By

Published : Aug 1, 2021, 9:11 PM IST

Manipur to produce a film on Olympic silver medallist Mirabai Chanu's life
వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ బయోపిక్​కు రంగం సిద్ధం

ఒలింపిక్స్​ విజేత, వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్ బయోపిక్​కు అంతా రెడీ అయింది. మణిపుర్​కు చెందిన నిర్మాణ సంస్థ ఆమె జీవితం ఆధారంగా సినిమా తీయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.

టోక్యో ఒలింపిక్స్​లో రజత​ పతకాన్ని గెలుచుకున్న మహిళా వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చాను బయోపిక్​కు రంగం సిద్ధమైంది. ఆమె జీవితాధారంగా సినిమాను రూపొందించనున్నట్లు మణిపుర్​కు చెందిన ఓ చిత్ర నిర్మాణసంస్థ ప్రకటించింది.

స్యూటీ ఫిల్మ్స్​ ప్రొడక్షన్​ కంపెనీ ఛైర్మన్​ మనోబి ఎమ్​.ఎమ్. మాట్లాడుతూ.."మీరాబాయి చాను జీవితంలోని అనేక సంఘటనల ఆధారంగా మేం ఓ సినిమా రూపొందించనున్నాం" అని ఇటీవలే ప్రకటన చేశారు. ​ఈ నేపథ్యంలో మీరాబాయి చానుతో నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్​ప్లే, డైలాగ్స్​ను మనోబి ఎమ్​.ఎమ్​. అందించనుండగా.. ఓ.సి. మీరా దర్శకత్వంలో ఆర్​.కె. నళిని దేవి నిర్మించనున్నారు.

ఇదీ చూడండి.. ఇంటికి చేరిన మీరా.. మణిపూర్​లో ఘన స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.