ETV Bharat / sitara

ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్​కు బాఫ్టా నివాళులు

author img

By

Published : Apr 12, 2021, 12:17 PM IST

Irrfan Khan, Rishi Kapoor
రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్

బాఫ్టా వేడుకల్లో బాలీవుడ్ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్​లకు నివాళులర్పించారు. వీరితో పాటు ఇటీవల సినీ ప్రపంచం కోల్పోయిన కళాకారుల సేవల్ని గుర్తుచేసుకున్నారు.

బాలీవుడ్ దిగ్గజ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్​ ఖాన్​లకు ఘనంగా నివాళులర్పించింది బ్రిటీష్ అకాడమీ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా). ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో వారితో పాటు సీన్ కానరీ, కిర్క్ డగ్లస్, చడ్విక్ బోస్​మన్​, ఇంకా ఇటీవల సినీ ప్రపంచం కోల్పోయిన 40 వేల మంది కళాకారుల సేవల్ని గుర్తు చేసుకున్నారు.

ఈ వేడుకల్లో ప్రియంకా చోప్రా, ఆమె భర్త నికో జోనస్​తో కలిసి సందడి చేసింది. 74వ ​బాఫ్టా అవార్డుల వేడుక వర్చువల్​గా లండన్​లో జరుగుతోంది. రెండు రోజుల పాటే సాగే ఈవెంట్​లో భాగంగా తొలిరోజు ఎనిమిది కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. ఇందులో 'మా రైనీస్​ బ్లాక్​ బాటమ్' సినిమా రెండు పురస్కారాలను అందుకుంది.

ఇవీ చూడండి:

బాఫ్టా వేడుకలో ప్రియాంక సోయగాలు

బాఫ్టా అవార్డ్స్​: తొలి రోజు విజేతలు వీరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.