ETV Bharat / sitara

దీపావళికి కొత్త పోస్టర్ల ధమాకా.. జోష్​లో అభిమానులు

author img

By

Published : Oct 27, 2019, 12:13 PM IST

Updated : Oct 27, 2019, 12:20 PM IST

దీపావళికి కొత్త పోస్టర్ల ధమాకా.. జోష్​లో అభిమానులు

దీపావళిని మరింత ఆనందమయం చేసేందుకు కొత్త సినిమాల పోస్టర్​లు వచ్చేశాయి. అభిమానులను కనువిందు చేస్తూ సందడి చేస్తున్నాయి.

దీపావళిని మరింత వెలుగుల మయం చేసేందుకు సిద్ధమయ్యారు టాలీవుడ్ హీరోలు. శనివారం కొన్ని సినిమాల పోస్టర్​లు విడుదలయ్యాయి. ఆ జోష్​ను మరింత పెంచేందుకు ఆదివారం.. మరిన్ని సరికొత్త లుక్​లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిని చూసేయండి.

మహేశ్​ నవ్వుకు మరో భామ ఫిదా
సూపర్ స్టార్ మహేశ్​బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని కొత్త లుక్​ ఆకట్టుకుంటోంది. మహేశ్​ నవ్వుతూ ఉండగా, ఆ దిగువన నవ్వుులు చిందిస్తున్నా హీరోయిన్ రష్మిక ఫొటో అలరిస్తోంది. వచ్చే సంక్రాంతికి రానుందీ చిత్రం.

sarileru neekevvaru deepavali poster
సరిలేరు నీకెవ్వరు.. దీపావళి పోస్టర్

'రూలర్​'లో మాస్​గా బాలకృష్ణ
నటసింహం బాలకృష్ణ కొత్త సినిమాకు 'రూలర్'​ అనే టైటిల్​ నిర్ణయిస్తూ శనివారం ఓ ఫొటో పంచుకుంది చిత్రబృందం. అలాంటిదే మరోలుక్​ను ఆదివారం విడుదల చేసింది. అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. డిసెంబరు 20న రానుందీ చిత్రం.

balakrishna in ruler cinema
రూలర్​లో ధర్మ అనే పోలీస్​ అధికారిగా బాలకృష్ణ

బన్నీ.. దీపావళి సర్​ప్రైజ్
'అల వైకుంఠపురములో' చిత్రం నుంచి 'రాములో రాములా' పాటను శనివారం విడుదల చేసిన చిత్రబృందం.. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్​ను పంచుకుంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ala vaikuntapurramlo deepavali poster
'అల వైకుంఠపురములో' సినిమా దీపావళి పోస్టర్

వర్షంలో పక్కన భామతో
మాస్​ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'డిస్కోరాజా' నుంచి కొత్త లుక్​ విడుదలైంది. వర్షంలో గొడుగు పట్టుకుని నడుస్తున్న రవితేజ, నభానటేశ్ ఫొటో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వచ్చిన పాటలు, లుక్స్​ అలరిస్తున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

raviteja-nabha natesh in disco raja
డిస్కోరాజాలో రవితేజ-నభా నటేశ్

పిల్లాడి చేయిపట్టుకున్న నాగశౌర్య
'అశ్వథ్థామ' అంటూ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు హీరో నాగశౌర్య. దీపావళి సందర్భంగా తన కొత్త సినిమా లుక్​ను విడుదల చేశాడు. చిన్నపిల్లాడి చేయిపట్టుకున్న ఫొటో చిత్రంపై ఆసక్తి రేపుతోంది.

naga shourya new movie deepavi poster
నాగశౌర్య కొత్త చిత్రం అశ్వథ్థామ దీపావళి లుక్​

ఇది చదవండి: 'సిద్​'​ గాత్రానికి మనసులు పులకరిస్తాయ్​

AP Video Delivery Log - 0400 GMT News
Sunday, 27 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0343: Internet Trump Tweet AP Clients Only 4236859
Trump: Something very big has just happened!
AP-APTN-0219: US Wildfires AP Clients Only 4236858
Blackouts begin as winds build in California
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Oct 27, 2019, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.