ETV Bharat / sitara

విలనిజంలో హీరోయిజం చూపిస్తోన్న మన హీరోలు..!

author img

By

Published : Oct 6, 2019, 6:44 AM IST

విలనిజంలో హీరోయిజం చూపిస్తోన్న మన హీరోలు..!

హీరోలంటే ఎప్పుడూ మంచివాడిలానే ఉండాలి.. విలన్ అంటే చెడ్డవాడే..అని చాలామందిలో ఓ ముద్రపడిపోయింది. ఈ భ్రమలకు అడ్డుకట్ట వేస్తూ మన సినిమాల్లో కథానాయకుడి పాత్రనూ నెగిటివ్​గా చూపిస్తున్నారు దర్శకులు. యాంటీ హీరోల్లాగా పాపులరైన ఈ పాత్రలకు ప్రస్తుతం తెలుగులో ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

యాంటీ హీరోలు.. హీరోలు తెలుసు.. విలన్లూ తెలుసు ఈ యాంటీ హీరోలు ఏంటి అనుకుంటున్నారా! మన సినిమాల్లో అందరికి మంచి చేసేవాడు కథానాయకుడు.. చెడు చేసేవాడు ప్రతినాయకుడు. ఆ రెండింటి సమాహారమే ఈ యాంటీ హీరో క్యారెక్టర్. ఒక్కమాటలో చెప్పాలంటే విలనిజంలో హీరోయిజం చూపించే పాత్ర. జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్​​, గద్దలకొండ గణేశ్​లో వరుణ్​తేజ్​ పాత్రలు ఇలాంటివే.

తను ఎంచుకున్న మార్గమే సరైనది అనుకుంటూ సినిమా అంతా ప్రభావం చూపేది యాంటీ హీరో క్యారెక్టర్.. హాలీవుడ్​లో ఎప్పటినుంచో పాపులర్​ అయిన ఈ పాత్రలు తెలుగులో ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. మరి విలనిజంలోనూ హీరోయిజం చూపిస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం!

గజ గజ వణికించిన గణేశ్​..

హరీశ్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్​ వరుణ్​తేజ్ నటించిన చిత్రం గద్దలకొండ గణేశ్​. ఇందులో వరుణ్​ నెగిటీవ్ పాత్రలో కనిపించి.. చివరికి మంచివాడుగా మారే ప్రతినాయకుడి పాత్ర చేశాడు. తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. సెప్టెంబరు 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. మొదటి నుంచి విభిన్న పాత్రలవైపు మొగ్గు చూపిస్తున్న వరుణ్​ తేజ్​.. మొదటి సారి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలో నటించి మెప్పించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇస్మార్ట్ శంకర్​లో రామ్​..

పూరీజగన్నాథ్ - రామ్​ కాంబినేషన్​లో ఇస్మార్ట్​ శంకర్​ చిత్రంలో కథానాయకుడి పాత్ర ఈ కోవలోకే వస్తుంది. తప్పో, ఒప్పో తను చేసేదే కరెక్టు అనుకుంటాడు హీరో. నమ్మిన వ్యక్తి కోసం ఒకరిని చంపి చిక్కుల్లో పడతాడు. అతడు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అనేది చిత్ర కథాంశం. ఎప్పటి నుంచో విజయం కోసం ఎదురు చూస్తున్న పూరీకి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లతో రామ్​ కెరీర్​లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రావణ్​గా.. తారక్

జై లవకుశ సినిమాలో మూడు విభిన్న పాత్రలు పోషించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు. ముఖ్యంగా జై అలియస్ రావణ్​ పాత్రలో తారక్.. నట విశ్వరూపాన్నే చూపించాడు. హావాభావాలు, వేషభాషలతో ఆకట్టుకున్నాడు. నత్తిగా మాట్లాడుతూనే భయపెట్టాడు. బాబి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బిల్లాలో.. ప్రభాస్​

2009లో విడుదలైన ఈ సినిమాలో ప్రభాస్ డబుల్​రోల్​లో మెప్పించాడు. బిల్లా, రంగ అనే రెండు పాత్రల్లో విభిన్నమైన నటనతో అలరించాడు డార్లింగ్. ఇందులో బిల్లా పాత్ర యాంటీహీరోకు దగ్గరగా ఉంటుంది. అనుకున్నది సాధించడం కోసం ఎవరినైనా చంపడానికి వెనకాడని ప్రతినాయకుడి క్యారెక్టర్ అది. సినిమాలో కనిపించేది కొద్ది సేపైనా ఆ పాత్ర చుట్టే కథ తిరుగుతుంటుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ మాదిరి విజయాన్ని అందుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలీవుడ్​లో ఇప్పటికే యాంటీహీరోలు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. డాన్​లో షారుఖ్ ఖాన్​, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్​లో ఆమిర్ ఖాన్​, ధూమ్​ సిరీస్​లో నటించిన జాన్​ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమిర్​ ఖాన్​ ఈ యాంటీ హీరో పాత్రల్లో నటించి మెప్పించారు.

ఇదీ చదవండి: 'పురస్కారాలు రాకపోయినా గౌరవం వచ్చింది'

AP Video Delivery Log - 1500 GMT News
Saturday, 5 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1458: Hong Kong Tension AP Clients Only 4233343
HK police out in force to stop protest flare-up
AP-APTN-1444: Portugal PM No access Portugal; No re-sale, archive 4233336
Portugal PM in tense encounter with elderly man
AP-APTN-1420: Germany Police Arrests No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4233340
Two German officers held on suspicion of rape
AP-APTN-1338: Greece Protest AP Clients Only 4233334
Anti-US/NATO demo as Pompeo visits Athens
AP-APTN-1331: Sweden US NKorea 2 AP Clients Only 4233333
NKorean delegation returns to Sweden talks
AP-APTN-1327: Greece Pompeo 2 AP Clients Only 4233332
US secretary of state meets Greece PM in Athens
AP-APTN-1317: Romania Crash AP Clients Only 4233330
10 dead as lorry collides with minibus in Romania
AP-APTN-1304: Greece Pompeo AP Clients Only 4233328
Pompeo on Ukraine probe, NKorea, as visits Greece
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.