ETV Bharat / sitara

సందడిగా స్టార్ హీరో వివాహం..

author img

By

Published : Nov 15, 2021, 9:29 PM IST

actor Rajkummar Rao marriage
రాజ్​కుమార్ రావ్ మ్యారేజ్

గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపుర్, రాగిణి ఎమ్​ఎమ్​ఎస్, క్వీన్, న్యూటన్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్​కుమార్ పెళ్లి సందడిగా జరిగింది. దాదాపు 11 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రేయసిని వివాహమాడాడు.

బాలీవుడ్​ ప్రముఖ నటుడు రాజ్​కుమార్ రావ్.. ఓ ఇంటివాడయ్యాడు. దాదాపు 11 ఏళ్ల నుంచి ప్రేమించిన ప్రేయసి పత్రలేఖను సోమవారం పెళ్లి చేసుకున్నారు. న్యూ చంఢీగడ్​లోని ది ఒబెరాయ్ సుఖ్​ విలాస్ స్పా రిసార్ట్​లో వీరి వివాహం జరిగింది. అంతకు ముందు శనివారం వీరి నిశ్చితార్థం జరిగింది.

actor Rajkummar Rao, Patralekhaa get married
రాజ్​కుమార్ రావ్-పత్రలేఖ పెళ్లి

ఈ జంటకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియాంక చోప్రా, తాప్సీ, సన్యా మల్హోత్రా, దియా మీర్జా, డైరెక్టర్ విక్రమాదిత్య వీరిలో ఉన్నారు. 2014లో వచ్చిన 'సిటీలైట్స్' సినిమా, 'బోస్: డెడ్/అలైవ్' సిరీస్​లో రాజ్​కుమార్-పత్రలేఖ కలిసి నటించారు.

actor Rajkummar Rao, Patralekhaa get married
రాజ్​కుమార్ రావ్-పత్రలేఖ పెళ్లి
actor Rajkummar Rao, Patralekhaa get married
రాజ్​కుమార్ రావ్-పత్రలేఖ పెళ్లి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.