ETV Bharat / science-and-technology

ఇకపై స్పామ్​ కాల్స్​ సైలెంట్​ కావాల్సిందే.. వాట్సాప్​ నయా ఫీచర్​!

author img

By

Published : Jun 20, 2023, 3:25 PM IST

WhatsApp new features
WhatsApp silence unknown callers and multi account feature

WhatsApp New Features : వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, స్పామ్ కాల్స్​ను ఇకపై మీరే స్వయంగా మ్యూట్​ చేసుకునే విధంగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. అదే విధంగా మల్టిపుల్​ అకౌంట్స్​ మధ్య సులువుగా స్విచ్​ కావడానికి వీలుగా మరో ఫీచర్​ను టెస్ట్​ చేస్తోంది.

WhatsApp New Features : వాట్సాప్​ మరో సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్​ ద్వారా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్​ను మ్యూట్​ (శబ్దం రాకుండా) చేసేందుకు మీకు అవకాశం కలుగుతుంది.

స్పామ్​ కాల్స్​కు చెక్​
WhatsApp silence unknown callers : వాట్సాప్​లో తెలియని నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్​ పెరిగిపోతున్నాయి. విదేశీ నెంబర్ల నుంచి, అలాగే ప్లస్​ 188, 427, 22, 24, 31, 494 నంబర్లతో మొదలయ్యే వాట్సాప్​ కాల్స్​ విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు మార్ఫింగ్ కాల్స్​, స్పామ్ కాల్స్​ చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. కొందరు వలపు వల విసురుతూ బ్లాక్​ మెయిల్​ చేస్తూ ఉంటే, మరికొందరు వ్యక్తిగత డేటాను సేకరించి.. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్​ మాతృసంస్థ మెటా ఈ కొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్​ వ్యక్తిగత గోప్యతను కాపాడుతుంది. అలాగే వినియోగదారులకు మరింత నియంత్రణను ఇస్తుందని మెటా పేర్కొంది.

ఈ కొత్త ఫీచర్​ ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ స్మార్ట్​ఫోన్​ల్లోనూ పనిచేస్తుంది. అయితే మీరు ఈ ఫీచర్​ను స్వయంగా ప్రైవసీ సెట్టింగ్స్​లోకి వెళ్లి ఎనేబుల్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎనేబుల్​ చేసిన తరువాత మీ కాంటాక్ట్​ లిస్ట్​లో లేని, తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్​ బయటకు వినిపించవు. ఈ ఫీచర్​ను మీరు ఎనేబుల్​ చేసుకోవాలంటే కచ్చితంగా గూగుల్​ ప్లేస్టోర్​ లేదా యాపిల్​ యాప్​ స్టోర్​లోకి వెళ్లి వాట్సాప్​ను అప్​డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

మెటా తన సోషల్​ మీడియా ప్లాట్​ఫారమ్​ వాట్సాప్​లో తరచుగా న్యూఫీచర్స్​ను అందుబాటులోకి తెస్తోంది. ఇటీవలే కొన్ని ఎంచుకున్న మార్కెట్లలో వాట్సాప్​ ఛానల్స్​ కూడా ప్రారంభించింది కూడా.

వాట్సాప్​ - మల్టీ అకౌంట్​ ఫీచర్​
WhatsApp Multi Account Feature : ఒకే డివైజ్​లో మల్టిపుల్​ అకౌంట్స్​ మధ్య సులభంగా మారడానికి (స్విచ్​ కావడానికి) వీలుగా వాట్సాప్​ ఓ సరికొత్త ఫీచర్​ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్​ ఇంకా టెస్టింగ్​ దశలోనే ఉంది.

యూజర్లు ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​, ట్విట్టర్​ లాంటి బహుళ ఖాతాల మధ్య సులువుగా మారడానికి (స్విచ్​ కావడానికి) ఈ ఫీచర్​ ఉపయోగపడుతుంది. వాట్సాప్​ ఐఫోన్​ కోసం ఈ ఫీచర్​ను రూపొందించింది. దీని ద్వారా యూజర్లు ఒకే సారి నాలుగు డివైజ్​ల్లో ఒకే నెంబర్​తో ఖాతాలను కలిగి ఉండడానికి వీలు కల్పిస్తుంది.

డబ్ల్యూఏ బీటా ఇన్​ఫో ప్రకారం, ఆండ్రాయిడ్​ వాట్సాప్​ బిజినెస్​ ఖాతాల్లో ఇప్పటికే ఈ ఫీచర్​ను పొందుపరిచారు. దీని ద్వారా వివిధ నెంబర్లతో ఉన్న వాట్సాప్​ ఖాతాల మధ్య సులభంగా స్విచ్​ కావడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. దీని వల్ల బిజినెస్​ చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మల్టిపుల్​ వాట్సాప్​ నెంబర్స్​ కలిగిన యూజర్లు.. ఇకపై వాట్సాప్​ క్లోనింగ్​ చేయాల్సిన పని ఉండదు. అలాగే ఎక్కువ డివైజ్​లు వాడాల్సిన పని కూడా ఉండదు.

  • Will Cathcart and Mark Zuckerberg confirm to WABetaInfo 3 features to come on @WhatsApp! 😱@wcathcart https://t.co/sDm41MpQiG

    This is an amazing story. Disappearing mode, view once and multi device features are coming soon for beta users!

    — WABetaInfo (@WABetaInfo) June 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతానికి వాట్సాప్ బిజినెస్​లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్​ త్వరలో వాట్సాప్​ మెసెంజర్​లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. అయితే నార్మల్​, బీటా వెర్షన్స్​లో దీనిని ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో.. ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.