ETV Bharat / science-and-technology

మరుగుజ్జు గ్రహం 'సెరెస్'​పై సమృద్ధిగా నీరు

author img

By

Published : Aug 16, 2020, 6:49 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

Science- NASA-Dwarf planet
మరుగుజ్జు గ్రహం 'సెరెస్'​పై సమృద్ధిగా నీరు: నాసా

మార్స్​, బృహస్పతి మధ్య ప్రధాన ఉల్క బెల్ట్​లో ఉన్న మరుగుజ్జు గ్రహం సెరెస్​పై సమృద్ధిగా నీరు ఉన్నట్లు గుర్తించింది నాసా. డాన్​ స్పేస్​ క్రాఫ్ట్​ నుంచి వచ్చిన సమాచారంతో ఈ మేరకు నిర్ధరించారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధన నేచర్​ ఆస్ట్రానమీ, నేచర్​ జియోసైన్స్​లో ప్రచురితమైంది.

మార్స్​, బృహస్పతి మధ్య ప్రధాన ఉల్క బెల్ట్​లో ఉన్న మరుగుజ్జు గ్రహం సెరెస్​.. గతంలో నమ్మినట్లుగా అంతరిక్ష శిల కాదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. డాన్​ అంతరిక్ష నౌక నుంచి వచ్చిన తాజా నివేదిక ప్రకారం నీటితో సమృద్ధిగా ఉన్నట్లు నిర్ధరణ అయింది. సెరెస్​ ఉపరితలం కింద ఉప్పునీటి జలాశయం ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. అది 40 కిలోమీటర్ల లోతు, వందల మైళ్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు.

Science- NASA-Dwarf planet
సెరెస్​పై నీటి జాడలు

ఈ పరిశోధన ఆగస్టు 10న నేచర్​ ఆస్ట్రానమీ, నేచర్​ జియోసైన్స్​లో ప్రచురితమైంది.

"సెరెస్..​ చంద్రుడి కంటే చాలా చిన్నది. డాన్​ అంతరిక్ష నౌక 2015లో సెరెస్​ సమీపంలోకి చేరుకుంది. ఈ మిషన్​కు ముందే టెలిస్కోపులతో ప్రకాశవంతమైన ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, వాటి స్వభావం తెలియలేదు. 2018, అక్టోబర్​లో మిషన్​ ముగింపు దశలో సెరెస్​పై ప్రకాశవంతమైన ప్రాంతాల గుట్టు వీడింది. సోడియం కార్బొనేట్​తో నిండిన నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు."

-మార్క్​ రాయ్​మన్​, మిషన్​ డైరెక్టర్​

ఈ పరిశోధన సెరెస్​లోని ప్రకాశవంతమైన ప్రాంతాలు రెండు మిలియన్ల సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్నట్లు నిర్ధరించింది.

Science- NASA-Dwarf planet
సెరెస్​ పై నీటి జాడలు కనుగొన్న నాసా

ఇదీ చూడండి: ఇంటి మిద్దెపై విమానం.. ఔత్సాహికుడి ఘనత

Last Updated :Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.