ETV Bharat / science-and-technology

ఆండ్రాయిడ్​ ఫోన్​లో అదిరిపోయే ట్రిక్స్​.. ఈ 5 ఫీచర్లు తెలిస్తే మీ పనులు మరింత ఈజీగా..

author img

By

Published : Apr 28, 2023, 3:26 PM IST

android features you didn't know about
android features you didn't know about

మనం రోజూ వాడే స్మార్ట్‌ఫోన్లలో చాలా ఫీచర్లు ఉంటాయి. కానీ వాటి గురించి మనకు అవగాహన లేకపోవడం వల్ల లేదా తెలియక చాలామంది ఉపయోగించుకోరు. తెలిసినా కొన్ని సాధారణ ఫీచర్లను మాత్రమే రోజూ వాడుతూ ఉంటారు. కానీ ఫోన్లలో ఉండే కొన్ని ట్రిక్స్ గురించి తెలుసుకుని ఉపయోగించుకోవడం వల్ల.. మన పనులు సులువుగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ఈ ఐదు బెస్ట్ ట్రిక్స్ గురించి మీరు తెలుసుకోండి.

ఎక్కువమంది తక్కువ ధరకే లభించే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తుంటారు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా ట్రిక్స్ ఉంటాయి. వాటి గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల చాలా మంది వాటిని ఉపయోగించరు. ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా మందికి తెలియని ఐదు అదిరిపోయే ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వన్ హ్యాండెడ్ టైపింగ్‌
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే జీ-బోర్డ్ కీబోర్డ్‌లో అందుబాటులో ఉండే చిన్న ట్రిక్‌ల వల్ల టైపింగ్ చాలా సులువు అవుతుంది. ఆండ్రాయిడ్ కీబోర్డ్‌లో ఉండే వన్ హ్యాండెడ్ మోడ్ ఫీచర్ వల్ల కీబోర్డ్‌ను మరింత సులువుగా ఉపయోగించుకోవచ్చు. దీని కోసం జీ-బోర్డ్‌లోని వన్ హ్యాండెడ్ టైపింగ్‌ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.

  • జీ బోర్డ్ ఓపెన్ చేయాలి
  • కీబోర్డ్ పైన కనిపించే 3 నిలువు చుక్కలపై క్లిక్ చేయాలి
  • ఆ తర్వాత వన్ హ్యాండెండ్ మీద నొక్కాలి
  • ఆ తర్వాత.. అక్కడ కనిపించే క్యారెట్ (^) సింబల్‌పై క్లిక్ చేసి మీకు కీబోర్డ్ ఎడమవైపు లేదా కుడివైపు కావాలా అనేది ఎంచుకోవాలి.
  • కీబోర్డ్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి స్క్వేర్​ షేప్​లో సూచించే బాణాల గుర్తులపై క్లిక్ చేయాలి.
    five rare use android features
    వన్ హ్యాండెడ్ టైపింగ్‌

సెర్చ్​ ఫీచర్
ఇక ఆండ్రాయిడ్‌లో లభించే మరో మంచి ఫీచర్​.. ఫోన్ ద్వారా ఏదైనా సమాచారాన్ని సేకరించే విధానం. ఈ ట్రిక్ ద్వారా మన ఫోన్‌లోని సందేశాలు, ఫోన్ నెంబర్లు, సెట్టింగ్, ఇతర సమాచారాన్ని సులువుగా పొందవచ్చు. ఇందుకోసం ఈ క్రింది విధంగా చేయాలి.

  • హోం స్క్రీన్ మీద స్వైప్​ చేయండి.
  • పైన కనిపించే సెర్చ్ బార్‌లో మీరు దేనిని శోధించాలనుకుంటున్నారో ఆ విషయం గురించి టైప్ చేయండి.

గ్యాలరీ సెర్చ్
ఆండ్రాయిడ్‌లో ఉండే మరో బెస్ట్ ఫీచర్ గ్యాలరీ సెర్చ్. దీని ద్వారా నిర్ధిష్ట నెల లేదా ఫైల్ పేరుతో వెంటనే మనకు కావాల్సిన ఫొటోలను పొందవచ్చు. మరింతగా ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు గూగుల్ ఫోటోస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

five rare use android features
గ్యాలరీ సెర్చ్

రొటీన్స్ ఫీచర్
ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఉండే రొటీన్ ఫీచర్ ద్వారా మీ జీవితంలో రోజూ జరిగే అన్ని విషయాలను ట్రాక్ చేయవచ్చు. ఇందుకోసం ఈ స్టెప్స్​ను అనుసరించండి.

  • సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • మోడ్స్ అండ్ రొటిన్స్ ఆప్షన్‌ను ఎంచుకోండి
  • కింద కనిపించే రొటిన్స్ బటన్ మీద ట్యాప్ చేయండి
  • టాప్‌లో కనిపించే + సింబల్‌పై క్లిక్ చేయండి
  • IF ట్యాబ్‌పై ట్యాప్ చేసి రొటిన్ సమయం ఎంచుకోండి
  • ఆ తర్వాత డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
    five rare use android features
    గూగుల్​ డ్రైవ్​తో డాక్యుమెంట్​ స్కాన్

గూగుల్​ డ్రైవ్​తో డాక్యుమెంట్​ స్కాన్
ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మరో అదిరిపోయే ఫీచర్ కూడా ఉంది. అదే గూగుల్ డ్రైవ్ ద్వారా పత్రాలను స్కాన్ చేయవచ్చు. అదేలాగో తెలుసుకుందాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.