ETV Bharat / priya

'వెజ్‌ సీక్‌ కబాబ్‌' శాకాహారుల స్పెషల్ రెసిపీ!

author img

By

Published : Oct 3, 2020, 3:38 PM IST

veg seek kabab recipe in telugu
'వెజ్‌ సీక్‌ కబాబ్‌' శాకాహారుల స్పెషల్ రెసిపీ!

మాంసాహారులంటే కబాబుల్లో రకరకాల టేస్టులు వెతుక్కుంటారు. అయితే, , శాకాహారులకు మాత్రం కబాబ్ అంటే పనీర్ మాత్రమేననే అపోహ మిగిలిపోయింది. కానీ, బోలెడన్నీ కూరగాయలతో అంతకు మించిన రుచితో ఈజీగా 'వెజ్ సీక్ కబాబ్' చేసుకోండిలా..

'వెజ్‌ సీక్‌ కబాబ్‌' చేసుకుంటే శాకాహారులకే కాదు.. మాంసాహారులూ ఒక్క సీక్ వదలకుండా లాగించేస్తారు. మరి రెసీపీ చూసేయండి....

కావాల్సినవి

ఆలూ - మూడు పెద్దవి, సోయా మీల్‌ మేకర్‌ - ఒకటిన్నర కప్పు, బఠాణీలు - అరకప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద - చెంచా, ఉప్పు - తగినంత, ధనియాల పొడి - చెంచా, గరంమసాలా, కారం, మిరియాలపొడి - అరచెంచా చొప్పున, ఆమ్‌చూర్‌ పొడి - పావుచెంచా, వేయించిన సెనగపిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె - పావుకప్పు.

తయారీ

ముందుగా నానబెట్టి బఠాణీలను ఉడికించుకోవాలి. అలాగే ఆలూను కూడా ఉడికించుకుని తీసుకోవాలి. సోయా మీల్‌ మేకర్‌ని వేడినీటిలో వేయాలి. అవి మునిగాక నీటిని వంపేసి.. వాటిని పిండి విడిగా మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మీల్‌మేకర్‌లో ఉడికించిన ఆలూ ముక్కలూ, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. తరవాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మరోసారి కలిపి చపాతీ పిండిలా చేసుకోవాలి. ఒకవేళ పిండి మరీ మెత్తగా ఉంటే... మరికొంచెం సెనగపిండి చేర్చుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని తొమ్మిది భాగాలుగా చేయాలి. ఒక్కోదాన్ని ఇనుప చువ్వలకు లేదా పొడవాటి చాప్‌స్టిక్స్‌కి గుచ్చుకోవాలి. తరవాత వీటికి నూనె రాయాలి. ఇప్పుడు 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసిన ఓవెన్‌లో పదిహేను నిమిషాలు బేక్‌ చేసుకుని తీసుకోవాలి. లేదంటే గ్రిల్‌ పాన్‌ని పొయ్యిమీద పెట్టి.. ఒక చువ్వను ఉంచి.. తిప్పుతూ కాల్చుకుని తీసుకుంటే చాలు. వీటిని పుదీనా చట్నీతో కలిపి వడ్డించాలి.

ఇదీ చదవండి: 'క్యారెట్‌- కొబ్బరి పూర్ణాలు' వాసనకే ఊరతాయి నోళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.