ETV Bharat / jagte-raho

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం.. భారీగా దొంగతనాలు!

author img

By

Published : Dec 26, 2020, 7:55 PM IST

thief was arrested by medipally police in rachakonda police commissionerate
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం.. భారీగా దొంగతనాలు!

జీవనోపాధికోసం వలస వచ్చి జల్సాలకు అలవాటు పడ్డాడు. వాటి మోజులో పడి దొంగతనాలకు పాల్పడ్డాడు. తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలు చేశాడు. ఫలితంగా పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నాడు. నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మల్కాజ్​గిరి ఏసీపీ శ్యాంప్రసాద్​ రావు మీడియాకు వివరించారు.

వలస వచ్చి.. జల్సాలకు అలవాటు పడి

కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన బలిజ విక్కి జీవనోపాధి కోసం మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్​లోని కమలానగర్​కు వలస వచ్చాడు. ‌జల్సాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. గతంలో జూబ్లీహిల్స్, కుషాయిగూడ, కీసర, ఓయూ, నల్లకుంట, మలక్​పేట్, కూకట్‌పల్లి పీఎస్​ పరిధిల్లో చోరీలు చేశాడు. ఈ క్రమంలో 19 దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లాడు.

పీడీ చట్టం కింద కేసు నమోదయినా అతను దొంగతనాలు చేయడం మానుకోలేదు. తర్వాత మేడిపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్ పీఎస్ పరిధిల్లో 6 చోరీలు చేశాడు. చెంగిచర్ల కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విక్కీని నేర విభాగం బృందం అదుపులోకి తీసుకుందని ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి 11తులాల బంగారం, 20తులాల వెండి ఆభరణాలు, రూ.20 వేల నగదు, ఒక‌ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


ఇదీ చదవండి: విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.