ETV Bharat / jagte-raho

విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రైతు మృతి

author img

By

Published : Sep 22, 2020, 8:12 PM IST

farmer died with current shock at doultabad
విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతు మృతి

వ్యవసాయ పొలానికి వెళ్లేటప్పుడు.. దారికి అడ్డంగా ఉన్న విద్యుత్​ తీగను తీసే క్రమంలో విద్యుదాఘాతమై ఓ రైతు మరణించిన ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​లో జరిగింది. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​ మండలకేంద్రంలో వ్యవసాయ పొలానికి వెళ్లేటప్పుడు విద్యుత్​ వైరు తగిలి విద్యుదాఘాతంతో ఓ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత పది రోజుల నుంచి పొలానికి వెళ్లే దారిలో విద్యుత్​ వైర్లు తెగి కింద పడిపోయాయని, విద్యుత్​ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని స్థానికులు తెలిపారు. రోజులా రైతు రాములు పొలం వద్దకు వెళ్తుండగా కరెంట్​ వైరు అడ్డంగా ఉాందని.. పక్కకు తీసేటప్పుడు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

గత నెల రోజుల నుంచి ఇలా గ్రామంలో కరెంట్ షాక్​తో ముగ్గురు మరణించారని.. ఇదంతా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి.. అక్కడ ఉన్న విద్యుత్​ వైరును తొలగించాలని మాజీ సర్పంచ్​ ఆదివేను డిమాండ్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండిః చేపలకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.