ETV Bharat / international

అమెరికాలోని భారతీయుల ఇళ్లలో వరుస చోరీలు- పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు

author img

By ETV Bharat Tech Team

Published : Dec 22, 2023, 5:43 PM IST

Robbery On Indo Americans Houses In US Announced By Police
Robbery On Indo Americans Houses In US Washington

Robbery On Indo-Americans Houses : భారతీయ అమెరికన్ల ఇళ్లే లక్ష్యంగా యూఎస్​ రాజధాని వాషింగ్టన్​లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గత రెండు వారాలుగా ఇవి ఎక్కువయ్యాయని అమెరికా పోలీసులు తెలిపారు.

Robbery On Indo-Americans Houses : ఇండో-అమెరికన్ల నివాసాలే లక్ష్యంగా యూఎస్​ రాజధాని వాషింగ్టన్​లో దుండగులు వరుస చోరీలకు పాల్పడుతున్నారని అమెరికా పోలీసులు తెలిపారు. గత రెండు వారాలుగా ఇవి మరింత ఎక్కువయ్యాయని చెప్పారు. వాషింగ్టన్​లోని వివిధ ప్రాంతాల్లో నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని అక్కడి మీడియా సంస్థలూ పేర్కొంటున్నాయి. ముఖ్యంగా బోథెల్ ప్రాంతంలో నివసించే భారతీయ అమెరికన్ల ఇళ్లను దొంగలు ప్రధాన లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు అందగా స్నోహోమిష్ కౌంటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

"దుండగులు ఇండో-అమెరికన్ల ఇళ్లలోనే చోరీలకు పాల్పడుతున్నారు. గత రెండు వారాలుగా ఇవి మరింతగా పెరిగిపోయాయి. అది కూడా పగటిపూట ఈ దోపిడీలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వారికి ఒక పెద్ద వ్యవస్థ ఉన్నట్లు భావిస్తున్నాం. చోరీ జరిగిన ప్రాంతాల్లో దొంగలకు సంబంధించి ఏవైనా వీడియోలు లేదా ఫొటోలు సీసీటీవీల్లో రికార్డ్​ అయి ఉంటే వాటిని మాకు సమర్పించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాము."
- రాబరీ అండ్ బర్గ్‌లరీ యూనిట్​

'దొంగల భయంతో ఇంటికి సీసీ కెమెరాలతోపాటు మేము పెప్పర్​ స్ప్రే క్యాన్​లు కూడా సిద్ధంగా ఉంచుకుంటున్నాము. ఇందుకోసం వేల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలావరకు దొంగతనాలు నాన్​-అమెరికన్ల ఇళ్లలోనే జరుగుతున్నాయి. అయితే ఆత్మరక్షణ కోసం అమెరికన్​ పౌరుల దగ్గర ఉండే విధంగా వీరి దగ్గర ఆయుధాలు ఉండకపోవచ్చు. ఈ కారణంతోనే దుండగులు రెచ్చిపోయి ఈ విధంగా నాన్​-లోకల్స్​ను టార్గెట్​ చేసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటున్నాను' అని ఇక్కడ నివసిస్తున్న భారతీయ అమెరికన్​ రామ్​ చెప్పారు.

కాన్యన్ క్రీక్ ప్రాంతంలోని ప్రజల ఇళ్లలోకి చొరబడిన కొందరు అనుమానితుల ఫొటోలను స్నోహోమిష్ కౌంటీ పోలీసులు బుధవారం విడుదల చేశారు. పౌరులందరూ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. విలువైన వస్తువులను భద్రపరచుకోవాలని, అన్ని కిటికీలు, స్లైడింగ్ తలుపులు, యాక్సెస్ పాయింట్‌లు లాక్​ చేసుకుని ఉంచుకోవాలని ప్రజలను కోరారు.

రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్​గా మేక్రాన్​! బైడెన్​కు బదులుగా ఆయనే!!

యూనివర్సిటీలో కాల్పుల కలకలం- 15మంది మృతి, మరో 9మంది పరిస్థితి విషమం!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.