ETV Bharat / international

ఉక్రెయిన్ ప్రథమ మహిళకు కరోనా పాజిటివ్​

author img

By

Published : Jun 12, 2020, 10:22 PM IST

Ukraine's First Lady has virus
ఉక్రెయిన్ ప్రథమ మహిళకు కరోనా పాజిటివ్​

ఉక్రెయిన్​ ప్రథమ మహిళ ఒలేనా జెలెన్​స్కాకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ఇన్​స్టాగ్రామ్​లో వెల్లడించారు. తన కుటుంబ సభ్యులను ప్రమాదం లోకి నెట్టకుండా ఉండేందుకు ఆమె ఏకాంతంగా ఉంటున్నట్లు చెప్పారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్​ జెలెన్​స్కీ సతీమణి, ఆ దేశ ప్రథమ మహిళ ఒలేనా జెలెన్​స్కా కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఇన్​స్టాగ్రామ్​ ద్వారా ఆమె తెలిపారు. కుటుంబ సభ్యులకు తన వల్ల వైరస్​ ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో వారి నుంచి ఏకాంతంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన భర్త, పిల్లలకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు చెప్పారు ఒలేనా.

ఐరోపా దేశం ఉక్రెయిన్​లో ఇప్పటివరకు 29వేల పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 870 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ ప్రభావం తగ్గిందని మే చివరి నుంచి ఆ దేశంలో లాక్​డౌన్ ఆంక్షలు సడలించారు. ప్రజారవాణా పునరుద్ధరించారు. షాపింగ్ మాల్స్, జిమ్​ కేంద్రాలు తెరిచేందుకు అనుమతిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.