ETV Bharat / international

భూమిని పోలిన మరో రెండు గ్రహాలు

author img

By

Published : Jun 19, 2019, 8:56 PM IST

భూమిని పోలిన మరో రెండు గ్రహాలు

భూమిని పోలిన మరో రెండు గ్రహాలను జర్మనీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాలపుంతకు సమీపంలోని ఓ నక్షత్రం చుట్టూ ఇవి పరిభ్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహాలపై నీటి జాడ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల్లో భూమిని పోలిన గ్రహాలు ఇంతవరకు కనిపించలేదు. అంగారకుడిపై నీరుందా అనే అంశాన్ని కనుగొనేందుకు నాసా సహా, ప్రపంచంలోని శాస్త్రజ్ఞులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఓ విషయం బయటకు వచ్చింది. భూమిని పోలిన మరో రెండు గ్రహాలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. గెలాక్సీకి సమీపంలోని మరో నక్షత్రం చుట్టూ ఇవి పరిభ్రమిస్తున్నట్లు వారు కనుగొన్నారు.

భూమి నుంచి కేవలం 12.5 కాంతి సంవత్సరాల దూరంలోని టీ గార్డెన్ నక్షత్రం చుట్టూ ఇవి పరిభ్రమిస్తున్నాయి. మేషరాశి దిశలో ఈ ఎరుపు మరుగుజ్జు నక్షత్రం ఉన్నట్లు ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్ ఓ అధ్యయనాన్ని​ ప్రచురించింది.

ఈ నక్షత్రం ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 2,700 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని, దాని ద్రవ్యరాశి, సూర్యుని ద్రవ్యరాశిలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు లెక్క గట్టారు. భూమికి అత్యంత సమీపంలోనే ఈ నక్షత్రం ఉన్నప్పటికీ 2003 వరకు దీనిని గుర్తించలేక పోయారు.

"ఈ నక్షత్రం ఆవర్తనాలు, పరిమాణంలో జరిగే మార్పులను గత మూడేళ్లుగా పరిశీలిస్తున్నాం."

-మథ్యూస్ జెక్మీస్టర్, పరిశోధకుడు, గొట్టింజెన్ విశ్వవిద్యాలయం, జర్మనీ

సౌరకుటుంబ గ్రహాలను పోలి...

ఈ నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ రెండూ సౌరకుటుంబంలోని గ్రహాలను పోలి ఉన్నాయి. భూమి కంటే ఈ గ్రహాల పరిమాణం కొంచెం పెద్దదని, నీటి జాడలు కనిపించడం వల్ల నివాసానికి యోగ్యమైనవిగా భావిస్తున్నట్లు ప్రకటించారు పరిశోధకులు.

ఈ నక్షత్రంపై జరిగే మార్పులను స్పెయిన్ టియేడ్ పరిశోధన కేంద్రంలోని కార్లోజ్ శాంచెజ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు.

గ్రహాల పరిభ్రమణం సరిగా ఉండాలంటే నక్షత్రముఖంగా అవి తిరుగుతుండాలి. తక్కువ సమయంలో నక్షత్రం నుంచి వచ్చే కాంతిని నిరోధించాలి. ఎలాగంటే సరిగ్గా భూమిని, సూర్యుడిని కలిపే రేఖ మధ్యన ఉన్నట్టుగా ఉండాలి. ఈ తరహా అమరిక కొన్ని గ్రహ వ్యవస్థల్లో మాత్రమే ఉంటుందని పరిశోధకులు అన్నారు.

ఇదీ చూడండి: రోదసిలో 'రావణ'సేనను మోహరిస్తున్న లంక

Intro:Body:

a


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.