ETV Bharat / international

అక్కడ కూరల్లో మసాలాకు బదులు మట్టి.. టేస్ట్​ అదుర్స్​!

author img

By

Published : Nov 18, 2021, 7:12 AM IST

these-island-people-use-soil-as-masala
కూరల్లో మసాలాకు బదులు మట్టి

కూరల్లో మట్టి వేసుకొని ఎప్పుడైనా తిన్నారా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? అవును మరి ఓ చోట కూరల్లో మసాలాకు బదులు మట్టి వాడుతుంటారు. వంటలో మట్టిని వేస్తే అద్భుతమైన రుచి వస్తుందట. ఇదెక్కడంటే?

ఘుమఘుమలాడే కూరలు వండాలంటే.. అందులో మసాలా వేయాల్సిందే. వాటిని కలిపితే కానీ వంటకు రుచి రాదు. భారతీయులైతే మసాలా లేకుండా వంటను ఊహించలేరు. భారత్‌లోనే కాదు, వివిధ దేశాల ప్రజలు కూడా వారి అభిరుచికి తగ్గట్టు మసాలా మిశ్రమాలను వాడుతుంటారు. అయితే, పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ పరిధిలో ఉన్న హర్ముజ్‌ ఐలాండ్‌లోని ప్రజలు మాత్రం మట్టినే మసాలాగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడి మట్టిని వంటలో వేస్తే అద్భుతమైన రుచి వస్తుందట.

ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా ఈ ఐలాండ్‌లోని పర్వతాలు వివిధ వర్ణాల్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని రెయిన్‌బో ఐలాండ్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడి ఒక్కో రంగు పర్వతం ఒక్కో రుచిగల మట్టిని కలిగి ఉంటుంది. దీంతో స్థానిక ప్రజలు ఈ పర్వతాల మట్టిని మసాలా దినుసులు కలిపినట్టు కలిపేసి.. వంటల్లో వేస్తుంటారు. ఇక్కడి మట్టిలో ఐరన్‌తోపాటు 70 రకాల ఖనిజాలున్నాయట. దీంతో ఈ మట్టి మసాలాలు రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని స్థానికులు చెబుతున్నారు.

these-island-people-use-soil-as-masala
హర్ముజ్​ ఐలాండ్​

ఈ ఐలాండ్‌లోని పర్వతాల్లో ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని, అవే కాలక్రమంలో మట్టిలో కలిసిపోయాయని భౌగోళిక శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, మట్టికి రుచి ఉండటం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఇక్కడి ప్రజలు ఆ రుచిని గుర్తించి వంటల్లో ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఈ రంగురంగుల పర్వతాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యటకులు కూడా హర్ముజ్‌ ఐలాండ్‌ ప్రత్యేక వంటలను రుచి చూసి ఫిదా అవుతుంటారు.

ఇవీ చూడండి: వామ్మో​.. ఈ చికెన్​ ఎగ్​ రోల్​ ఎంత పెద్దదో!

ఇదెక్కడి 'దోశ'రా బాబు.. డిటర్జెంట్​​ తప్ప అన్నీ వేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.