ETV Bharat / international

అమెరికా వదిలేసిన హెలికాప్టర్లతో తాలిబన్ల 'టెస్ట్ ​రైడ్'​!

author img

By

Published : Aug 27, 2021, 3:39 PM IST

taliban
తాలిబన్​

అమెరికా దళాలు విడిచిపెట్టి వెళ్లిన హెలికాప్టర్లను వాడుకునేందుకు తాలిబన్లు(taliban news) ఊవిళ్లూరుతున్నారు. కానీ సరైన శిక్షణ లేకపోవడం వల్ల వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాందహార్​ విమానాశ్రయంలో ఓ హెలికాప్టర్​.. చాలా సేపు నేల మీదే చక్కర్లు కొడుతూ కనిపిచింది. అందులో తాలిబన్ ఫైటర్లు ఉన్నట్టు సమాచారం. ఎంత ప్రయత్నించినా ఆ హెలికాప్టర్​ పైకి ఎగరలేదు. ఇప్పుడు ఈ వీడియో((taliban helicopter video) సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

అఫ్గానిస్థానంలో అమెరికా దళాలు విడిచిపెట్టి వెళ్లిన ఆయుధాలు, హెలికాప్టర్లు తాలిబన్ల(taliban news latest) చేతికి చిక్కడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే కొన్నింటిని ఎలా ఉపయోగించాలో తెలియక తాలిబన్లు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా హెలికాప్టర్లను నడపడంలో శిక్షణ లేని తాలిబన్​ ఫైటర్లు.. వాటిల్లో కూర్చుని, గాల్లోకి ఎగిరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా.. కాందహార్​ విమానాశ్రయంలో యూహెచ్​-60 బ్లాక్​ హాక్​ హెలికాప్టర్(taliban helicopter video)​ చక్కర్లు కొడుతూ కనిపించింది. నేల మీదే పదే పదే తిరిగింది కానీ పైకి మాత్రం ఎగరలేదు. అందులో తాలిబన్​ ఫైటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాంటి శిక్షణ లేకపోవడం కారణంగా.. ఆ ఛాపర్​ను ఎలా నడిపించాలో తెలియకు తాలిబన్లు ముప్పుతిప్పలు పడుతున్నారు.

  • ويډيو|کندهار ولايت
    د کندهار هوايي ډګر الوتنو ته چمتو کيږي، دا بلېک هاک امريکايي چورلکه چې خرابه شوې وه جوړه او فعاليت ته چمتو شوې.@A_Jahid_Jalal pic.twitter.com/XJB1sqn4E6

    — Jahid Jalal -جاهد جلال (@A_Jahid_Jalal) August 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎన్ని హెలికాప్టర్లు తాలిబన్లకు చిక్కాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదని అఫ్గాన్​ అగ్రరాజ్య అధికారులు వెల్లడించారు. అయితే దాదాపు 40కిపైగా ఛాపర్లు తాలిబన్ల వశమైనట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:- కాబుల్​లో గుబుల్​​.. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన

అఫ్గాన్​ సంక్షోభం..

అమెరికా దళాలు అన్ని వదిలేసి(us afghanistan withdrawal) హడావుడిగా దేశాన్ని వీడిన సమయం నుంచి దేశం సంక్షోభంలోకి జారుకుంది. ఆ తర్వాత మెరుపువేగంతో తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో అఫ్గాన్​లో పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి. అనేకమంది ప్రజలు అన్నింటినీ ఎక్కడికక్కడ విడిచిపెట్టి, ప్రాణ భయంతో ఇతర దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబుల్​ విమానాశ్రయంలో గత కొన్ని రోజులుగా భారీ రద్దీ కనిపిస్తోంది.

ఇదే అదునుగా భావించిన ఉగ్రవాదులు, గురువారం కాబుల్​ విమానాశ్రయం వద్ద ఆత్మహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పలువురు అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ రక్తపాతాన్ని తాలిబన్లు ఖండించారు.

ఐసిస్​-కే ఈ జంట దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఐసిస్​-కే అంటే ఇస్లామిక్ స్టేక్​ ఖోరసన్​ ప్రావిన్స్(isis khorasan). ఇస్లామిక్ స్టేట్ ఉద్యమాన్ని మధ్య, దక్షిణాసియాకు విస్తరించడమే ఐసిస్​-కే లక్ష్యం. తాలిబన్ల(taliban latest news)ను ఐసిస్​-కే వ్యూహాత్మక ప్రత్యర్థిగా చూస్తుంది. వారిని కేవలం అధికారం కోసం పరితపించే 'హీనమైన జాతీయవాదులు'గా భావిస్తుంది. ఇస్లామిక్ స్టేట్ ఉద్యమ లక్ష్యానికి తాలిబన్లు విరుద్ధమని వారిని శత్రువులుగానే పరిగణిస్తుంది. అందుకే అఫ్గానిస్థాన్​పై దాడులు జరిపి.. జిహాదీ సంస్థల వారసత్వాన్ని స్వాధీనం చేసుకుని తామే అగ్రగామిగా అవతరించేందుకు ఐసిస్​-కే ప్రయత్నిస్తోంది.

ఐసిస్​-కే వల్ల అప్గాన్​కు మాత్రం పెద్ద ముప్పే పొంచి ఉంది. మైనారిటీలు, ప్రభుత్వ సంస్థలపై దాడులు ఎక్కువ జరగవచ్చు. ఈ ఏడాది కాబుల్​లో అమెరికా రాయబారిని చంపేందుకు కూడా ఈ సంస్థ ప్రయత్నించింది. ఇస్లామిక్ స్టేట్​ నుంచే ఐసిస్​-కేకు ఆర్థిక సాయం, సలహాలు-సూచనలు, శిక్షణా సహకారం అందేవని ఆధారాలున్నాయి. నిపుణుల ప్రకారం ఈ సంస్థకు ఐసిస్​ నుంచి దాదాపు 100 మిలియన్ డాలర్లు సమకూరాయి.

ఇదీ చూడండి:- Kabul airport blast: ముందు తాలిబన్ల కాల్పులు- కాసేపటికే పేలుళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.