ETV Bharat / international

అక్కడ ఇంటర్నెట్​పై నిషేధం- కండోమ్​ల వాడకం నేరం!

author img

By

Published : Jun 15, 2020, 3:26 PM IST

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
ఆ దేశంలో ఇంటర్నెట్​ నిషేధం-కండోమ్​లు వాడడం నేరం!

ప్రపంచమంతా అంతర్జాలంలో మునిగి తేలుతుంటే.. ఆ దేశంలో మాత్రం ఇంటర్నెట్​ నిషేధం. అక్కడి పౌరులకు బయటి ప్రపంచంతో సంబంధం లేదు. కనీసం, జట్టు కత్తిరించుకోవాలన్నా... ఆ దేశ అధ్యక్షుడు చెప్పినట్టే వినాలి. అంతెందుకు.. అక్కడ వినోదానికి విదేశీ పాటలు వినడమూ తప్పే. ఇక గర్భం నిరోధించేందుకు కండోమ్​లు వాడడం అక్కడ పెద్ద నేరం. ఇంతకీ, ఇంతటి వింత దేశం ఎక్కడుంది అనుకుంటున్నారా... అయితే పూర్తి కథనం చదివేయండి!

ఉత్తర కొరియా.. ఓ నియంత పాలనలో నలిగిపోతున్న దేశం. ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చెప్పిందే అక్కడ వేదం. స్వీయ రక్షణ కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలనైనా తీసుకునే కిమ్‌.. దేశం, దేశ పౌరులు పరాయి దేశం వల్ల ప్రభావితం కావడాన్ని అసలు సహించరు. ఇటీవల కాలంలో దక్షిణ కొరియాకు చెందిన కొందరు కిమ్‌కు వ్యతిరేకంగా కరపత్రాలను గాలిబుడగలకు కట్టి వదులుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశంలో తనపై వ్యతిరేకత పెరిగే అవకాశముందని గ్రహించిన కిమ్‌.. దక్షిణ కొరియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇకపై దక్షిణ కొరియాతో సమాచార మార్పిడిని నిషేధిస్తూ కిమ్‌ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో దక్షిణకొరియాతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా తన దేశ పౌరులపై ఇతర దేశాల సంస్కృతీ ప్రభావం పడకూడదని ఇప్పటికే దేశంలో అనేక నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. అవేంటో మీరే చదవండి..

టీవీ.. ఫారిన్‌ రేడియో

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
టీవీ.. ఫారిన్‌ రేడియో

విదేశీ వార్తలు.. సంస్కృతి దేశంలోకి రాకుండా టీవీ, ఫారిన్‌ రేడియోలపై కిమ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మధ్య కాలంలో చాలా మందికి టీవీ చూసే వెసులుబాటు లభించింది. అయితే ఉత్తర కొరియా మీడియా వార్తలు మాత్రమే వారు చూడాలి. అలా కాకుండా విదేశీ వార్తలు, సినిమాలు చూసినా.. ఫారిన్‌ రేడియోను విన్నా చట్టరీత్యా నేరం.

పాశ్చాత్య దుస్తులు

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
పాశ్చాత్య దుస్తులు

ఉత్తర కొరియాలో ప్రజలు పాశ్చాత్య దుస్తులు ధరించడం నిషేధం. బ్లూజీన్స్‌, డిజైనర్‌ షూస్‌, షార్ట్‌ స్కర్ట్స్‌ వంటివి వేసుకోవడం నేరంగా భావిస్తారు. చైనాకు సరిహద్దుగా ఉన్న ఉత్తర కొరియా ప్రావిన్స్‌లు నార్త్‌ హమ్యాంగ్‌, యాంగాంగ్‌పై చైనా ప్రభావం ఎక్కువగా పడుతుందట. అక్కడి వారికి చైనా సంస్కృతి, విదేశాల సమాచారం ఎక్కువగా తెలుస్తుంటాయట. అందుకే దేశంలో ఈ పాశ్చాత్య దుస్తులను కిమ్ ప్రభుత్వం నిషేధించింది.

కోకా కోలా.. దొరకదు అన్ని చోట్లా

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
కోకా కోలా.. దొరకదు అన్ని చోట్లా

కోకాకోలా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అమ్ముడయ్యే శీతల పానీయం. కానీ ఉత్తర కొరియాలో ఈ కూల్‌డ్రింక్‌ అమ్మకాలపై నిషేధించారు. విదేశీ ఉత్పత్తులను దేశంలోకి అనుమతించడానికి కిమ్‌ ఇష్టపడరు. అందుకే దేశంలో కొకాకోలాను నిషేధించారు. దీని ప్రత్యమ్నాయంగా ర్యాంగ్‌జిన్ కోలా పేరుతో శీతలపానీయాన్ని అమ్ముతున్నారు. కొన్ని చోట్ల కొకాకోలాను దొంగచాటుగా అమ్ముతుంటారు.

కిమ్ చెప్పిందే హెయిర్‌స్టైల్‌

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
కిమ్ చెప్పిందే హెయిర్‌స్టైల్‌

ప్రపంచదేశాల్లో కాలంతోపాటు హెయిర్‌ స్టైల్స్‌ మారుతూ వస్తున్నాయి. ఓ దేశంలో పుట్టిన హెయిర్‌స్టైల్‌ మరో దేశంలో ట్రెండ్‌ అవుతోంది. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు హెయిర్‌స్టైల్‌ చేసుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఉత్తర కొరియాలో విదేశీ హెయిర్‌స్టైల్స్‌ పూర్తిగా నిషేధం. దేశంలో జుట్టు పెంచుకోవడంపై నిబంధనలు ఉన్నాయి. ఆడవాళ్లు జుట్టును ఎప్పుడు చిన్నగా కత్తిరించుకోవాలి. మగవాళ్లు జుట్టును రెండు అంగుళాలకు మించి పెంచకూడదు. కిమ్‌ ఆమోదించిన కొన్ని రకాల హెయిర్‌స్టైల్స్‌నే పౌరులు చేయించుకోవాలి.

కండోమ్స్‌ వాడితే.. నేరమే

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
కండోమ్స్‌ వాడితే.. నేరమే

గర్భనిరోధక సాధనాలు వినియోగించడం ఉత్తరకొరియాలో నిషేధం. దేశంలో కుటుంబ నియంత్రణ అనేది లేదు. పౌరులు ఎక్కువ మందిని పిల్లలను కనడం ద్వారా దేశ జనాభాతో కార్మికుల సంఖ్య పెరుగుతుందని కిమ్‌ యోచన.

నో మ్యాగజైన్స్‌

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
నో మ్యాగజైన్స్‌

దేశంలో మీడియా ప్రచురించే ప్రతి వార్తను ప్రభుత్వం, ప్రత్యేక విభాగం పర్యవేక్షిస్తుంది. పౌరులపై పాశ్చత్య దేశాల ప్రభావం పడకుండా విదేశీ లైఫ్‌స్టైల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మ్యాగజైన్లను నిషేధించారు. దేశంలో కొన్ని స్థానిక మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. అయితే అవి విద్య, దేశ రాజకీయ అంశాలను మాత్రమే ప్రచురిస్తాయి.

విదేశీ ఆహారానికి అనుమతి లేదు

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
విదేశీ ఆహారానికి అనుమతి లేదు

స్టార్‌బక్స్‌, మెక్‌ డొనాల్డ్స్‌ వంటి ప్రముఖ కాఫీ, ఫుడ్‌ స్టోర్స్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. కానీ వీటికి ఉత్తర కొరియాలో అనుమతి లేదు. వీటినే కాదు.. విదేశీ ఫుడ్‌కోర్ట్‌లు వేటినీ దేశంలో ఏర్పాటు కానివ్వలేదు. అయితే ఆ దేశంలో ర్యాంగ్‌వాంగ్ పేరుతో కాఫీ కెఫెలో అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఈ కాఫీ ఫేమస్‌.

లోకల్‌ ఐపాడ్‌లే కొనాలి

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
విదేశీ సంగీతం వద్దు.. దేశీయమే ముద్దు

విదేశాల్లో తయారయ్యే హైటెక్‌ డివైజ్ల అమ్మకాలపై ఉత్తర కొరియాలో ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా యాపిల్‌ ప్రొడెక్ట్స్‌పై నిషేధముంది. యాపిల్‌ ఐపాడ్‌కు ప్రత్యామ్నాయంగా ఆ దేశంలో ట్యాబ్లెట్‌ పీసీ పేరుతో ఐపాడ్‌లను తీసుకొచ్చారు.

ఇంటర్నెట్‌.. విదేశీ కాల్స్‌ కట్‌

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
ఇంటర్నెట్‌.. విదేశీ కాల్స్‌ కట్‌

ప్రపంచాన్ని ఏకం చేసే ఇంటర్నెట్‌, అంతర్జాతీయ కాల్స్‌ ఉత్తర కొరియాలో నిషేధం. విదేశీ సమాచారాలు ఎక్కడా కనిపించకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్టేట్‌ కంట్రోల్‌ ఇంటర్నెట్‌’ను ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీనిని మాత్రమే వాడుకోవాలి. దేశంలో అతి తక్కువ మందికి మొబైల్‌ ఫోన్స్‌ ఉంటాయి. ఫోన్‌లో వాడే 3జీ ఇంటర్నెట్‌పై కూడా ఆంక్షలు ఉన్నాయి. పర్యటకులు ఆ దేశానికి వెళ్తే అక్కడ ప్రత్యేకంగా ఓ సిమ్‌ కొని అంతర్జాతీయ కాల్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

విదేశీ సంగీతం వద్దు.. దేశీయమే ముద్దు

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
విదేశీ సంగీతం వద్దు.. దేశీయమే ముద్దు

అంతర్జాతీయంగా పాప్‌ సంగీతానికి ఎంతో ఆదరణ ఉంటుంది. దక్షిణ కొరియాలో కే-పాప్‌ మ్యూజిక్‌ కన్సర్ట్స్‌ సంగీత ప్రియులను ఊర్రూతలూగిస్తాయి. కానీ ఇలాంటి పాప్‌ సంగీతాన్ని ఉత్తర కొరియా దగ్గరకు కూడా రానివ్వద్దు. అయితే దేశీయంగా మొరన్‌బ్యాంగ్‌ అనే బ్యాండ్‌ వినోదాన్ని పంచుతోంది. ఆ బ్యాండ్‌లో ఆడి.. పాడే అమ్మాయిలను స్వయంగా ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ ఎంపిక చేస్తారట.

విదేశీ యాత్రలు నిషేధం

north-korea-crazy-rules-and-prohibited-things-innorth-korea
విదేశీ యాత్రలు నిషేధం

దేశ పౌరులకు విదేశీ సంస్కృతే తెలియకుండా చేసిన కిమ్‌ ప్రభుత్వం.. ఇక విదేశాలకు వెళ్లడానికి అనుమతిస్తుందా? అక్కడి పౌరులు విదేశీ యాత్రలకు వెళ్లడం పూర్తిగా నిషేధం. అక్కడి ప్రజలు ఆ దేశం దాటి ఎక్కడికీ వెళ్లకూడదు. కేవలం దేశంలో ఉన్న పర్యటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే దేశంలో బానిసత్వం భరించలేక కొందరు సొరంగ, రహస్య మార్గాల ద్వారా దక్షిణ కొరియా, చైనాకు పారిపోతుంటారు.

ఇవే కాదు.. పర్యటకులు కొన్ని ప్రదేశాలను ఫొటో తీయడం, స్థానిక కరెన్సీ నోట్లను కలిగి ఉండటం కూడా నిషేధం. ఎవరైనా కిమ్‌పై వ్యంగ్యంగా మాట్లాడటం, బహిరంగ ప్రదేశాల్లో పాటలు పాడటం, చెవులకు పోగులు పెట్టుకోవడం వంటివి దేశంలో నేరంగా భావిస్తారు.

ఇదీ చదవండి:సుశాంత్​ కొన్నాళ్లుగా మందులు వాడటమే మానేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.