ETV Bharat / international

కార్చిచ్చు విధ్వంసం- 31 మంది మృతి

author img

By

Published : Sep 13, 2020, 9:56 AM IST

Death toll from devastating US west coast wildfires approaching 30
అమెరికాలో కార్చిచ్చు విధ్వంసం- 30 మంది మృతి

అమెరికాలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే... మరోవైపు దావానలం విస్తరిస్తోంది. కార్చిచ్చు ధాటికి ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. పలువురి ఆచూకీ గల్లంతయింది. లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం కాలిపోయింది. పలు నిర్మాణాలు దగ్ధమయ్యాయి.

అమెరికాలో కాలిఫోర్నియా, ఒరెగాన్​, వాషింగ్టన్​ రాష్ట్రాల్లో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతోంది. మంటల తాకిడికి ఇప్పటివరకు 31 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పలువురి ఆచూకీ గల్లంతయింది. ఒరెగాన్​లో 8 మంది చనిపోయారు. వాషింగ్టన్​లో ఓ ఏడాది చిన్నారి మంటల్లో చిక్కుకొని మరణించింది. కాలిఫోర్నియాలో 19 మంది అగ్నికి ఆహుతయ్యారు. తగిన సమయంలో అధికారులు హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Death toll from devastating US west coast wildfires approaching 30
అగ్నికి ఆహుతైన నివాస ప్రాంతం
Death toll from devastating US west coast wildfires approaching 30
దగ్ధమైన వాహనాలు

అటవీ ప్రాంతాల్లో మూగజీవులు ఎటూవెళ్లలేక మంటల్లో చిక్కుకొని చనిపోతున్నాయి. మరోవైపు కార్చిచ్చును అదుపు చేయడానికి 16 వేలమందికిపైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 30 లక్షల ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం దహనమైంది. 4 వేల నిర్మాణాలు దగ్ధమయ్యాయి.

Death toll from devastating US west coast wildfires approaching 30
మంటల్లో దహనమైన ఇళ్లు
Death toll from devastating US west coast wildfires approaching 30
అలుముకున్న దట్టమైన పొగ

కాలిఫోర్నియాకు ఉత్తర ప్రాంతంలో ఎన్నడూలేని విధంగా దావానలం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కాలిఫోర్నియా వెళ్లనున్నట్లు సమాచారం.

Death toll from devastating US west coast wildfires approaching 30
కాలిబూడిదైన కారు
అమెరికాలో కార్చిచ్చు విధ్వంసం- 30 మంది మృతి

ఇదీ చూడండి: ఫ్రాన్స్​లో మళ్లీ ఎల్లో వెస్ట్ నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.