ETV Bharat / international

Union Budget 2022: కేంద్ర బడ్జెట్​కు అమెరికా ఆర్థిక నిపుణుల కితాబు!

author img

By

Published : Feb 2, 2022, 10:34 AM IST

Budget 2022-23 balanced
అభివృధి ప్రాధాన్యత ఉండే బడ్జెట్

Union Budget 2022: కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్​పై భారత- అమెరికా ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ (యూఎస్​​ఏఐసీ) హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని మోదీ ప్రభుత్వం దీనిని రూపొందించినట్లు పేర్కొంది.

Union Budget 2022: భవిష్యత్​ తరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ను ప్రవేశ పెట్టినట్లు భారత- అమెరికా ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ (యూఎస్​​ఏఐసీ) అభిప్రాయపడింది. బడ్జెట్​లో అన్నీరంగాలకు సమానమైన ప్రాధాన్యం కల్పించినట్లు పేర్కొంది. వృద్ధితో పాటు ఆర్థిక పరిపుష్ఠితో ఈ సారి పద్దు ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

దేశ ఆర్థిక లోటును 6.9 శాతం వద్ద ఉంచడంతో పాటు మూలధన వ్యయాన్ని 35 శాతం పెంచడం అనేది ఓ కీలక నిర్ణయంగా యూఎస్​​ఏఐసీ అభివర్ణించింది. ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన కొత్త బడ్జెట్​లో రూ. 10.68 లక్షల కోట్లను మూలధన వ్యయంగా ప్రతిపాదించడం దేశ జీడీపీకి మరింత దన్నుగా నిలుస్తుందని చెప్పింది. సుమారు 4.1 శాతం మేర అధికంగా పెంచేందుకు వీలు ఉంటుందని యూఎస్​ఏఐసీ అధ్యక్షుడు కరుణ్​ రిషీ తెలిపారు.

కచ్చితమైన కేటాయింపులు..

దేశ ఆర్థిక లోటును దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే బడ్జెట్​ను రూపొందించినట్లు అమెరికా- ఇండియా స్ట్రాటజిక్​ పాట్నర్​షిప్ ​ఫోరం పేర్కొంది. ఇటువంటి పద్దును రూపొందించినందుకు గానూ ఆర్థిక మంత్రికి అభినందనలు తెలిపింది. ఈ పద్దులో అన్నీ రంగాలకు కేటాయించాల్సిన స్థాయిలో కేటాయింపులు జరిపినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ముకేశ్​ అఘీ పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా అక్కడ ఐసోలేషన్‌ అక్కర్లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.