ETV Bharat / international

ట్రంప్ దారిలో​నే బైడెన్​- చైనాకు వార్నింగ్!

author img

By

Published : Jul 12, 2021, 10:43 AM IST

joe biden
చైనా

దక్షిణ చైనా సముద్రంపై చైనా వాదనలను ఖండించింది అమెరికా. ఈ వ్యవహారంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వైఖరిని బైడెన్ సర్కారు సమర్థించింది.

చైనాకు మరోమారు గట్టి హెచ్చరికలు పంపింది అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం. దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్ చేస్తున్న​ వాదనలను తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ వైఖరినే సమర్థించింది.

ఫిలిప్పీన్స్​ జోలికి రావొద్దు..

ఫిలిప్పీన్స్​పై దాడికి దిగితే ఊరుకునేది లేదని హెచ్చరించింది అగ్రరాజ్యం. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో అలాంటి చర్యలకు పాల్పడితే అమెరికా జోక్యం తప్పదని తేల్చి చెప్పింది. ఫిలిప్పీన్స్​తో ఉన్న ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం ప్రకారం చర్యలుంటాయని స్పష్టంచేసింది.

స్ప్రాట్లీ దీవులు, పొరుగున ఉన్న దిబ్బలపై చైనా వాదనలకు వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్​కు అనుకూలంగా వచ్చిన అంతర్జాతీయ ట్రైబ్యూనల్ తీర్పునకు ఐదేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.

"నిబంధనల ఆధారిత మారిటైమ్ ఆర్డర్​కు దక్షిణ చైనా సముద్రంలో ఉన్నంత ముప్పు మరెక్కడా లేదు. ఆ ప్రాంతంపై 2020 విధానాన్నే సమర్థిస్తున్నాం. ఆగ్నేయాసియా తీరప్రాంత రాష్ట్రాలను బెదిరించి నౌకాయాన స్వేచ్ఛకు చైనా మోకాలడ్డుతోంది. ఫిలిప్పీన్స్​ సైన్యంపై దాడి, ఆయుధ సంపత్తి వినాశనానికి చైనా యత్నిస్తే అమెరికా జోక్యం తప్పదు."

-ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి

ఆ తీర్పు వచ్చి నాలుగేళ్లు అయిన సందర్భంగా దానిని సమర్థిస్తూ గతేడాది ట్రంప్​ సర్కారు కూడా చైనా వైఖరిని తప్పుబట్టింది. చైనా అంతర్జాతీయ గుర్తింపు పొందిన జలాల వెలుపల దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్ వాదనలన్నీ చట్టవిరుద్ధమైనవే అని ఆరోపించింది.

ఇదీ చూడండి: Joe Biden: డ్రాగన్‌ దూకుడుకు అమెరికా ముకుతాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.