ETV Bharat / entertainment

కొన్ని నాటు.. మరికొన్ని ఘాటు.. పందెం కోళ్ల పౌరుషంలా 'సంక్రాంతి' హీరోల పంచ్‌ డైలాగులు!

author img

By

Published : Jan 11, 2023, 12:13 PM IST

2023 Pongal Movie Dialogues
2023 Pongal Movie Dialogues

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడియన్స్​ను అలరించేందుకు అగ్రహీరోల సినిమాలు సిద్ధమయ్యాయి. వరుసగా 4 రోజులు.. ఒక్కోరోజు ఒక్కోహీరో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల్లోని డైలాగ్స్​ అందరి నోట వినిపిస్తున్నాయి. ఓ సారి ఆ డైలాగ్స్​ మీ కోసం..

ముగ్గుల పండగ రాకముందే సినిమాల పండగ షురూ అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అగ్ర హీరోల సినిమాలు వరసగా క్యూ కట్టాయి. జనవరి 11,12,13,14 తేదీల్లో అజిత్​ నటించిన 'తెగింపు', నటసింహం బాలకృష్ట నటించిన 'వీర సింహారెడ్డి', తర్వాత చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చివరిగా 'వారసుడు'తో దళపతి విజయ్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టీజర్‌, ట్రైలర్లలో వినిపించిన డైలాగ్స్ ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకుల్లో సినిమాలపై మరింత ఆసక్తిని పెంచేశాయి. వీరసింహారెడ్డిలో ఎక్కువగా ఊరమాస్‌, మిగిలిన వాటిలో పవర్‌ఫుల్‌తో పాటు క్లాస్‌ డైలాగ్​లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ డైలాగ్స్​ జనాల్లోకి ఎలా వెళ్తాయో అనేది సినిమాలు చూశాకే అంచనా వేయగలం. మరి ఆ సంభాషణలపై మనమూ ఓ లుక్కేద్దామా..

'వీరసింహారెడ్డి' అంటేనే ఊరమాస్​..

  • సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదనే నేను ఒక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత.
  • నాది ఫ్యాక్షన్‌ కాదు.. సీమ మీద ఎఫెక్షన్‌. వీరసింహారెడ్డి.. పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్‌ కర్నూలు.
  • సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు.
  • పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్‌ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ.
  • పది నిమిషాల్లో క్లోజ్‌ అయ్యే ఏ పబ్‌ దగ్గరకైనా వెళ్లు.. అక్కడ నీకు ఒక స్లోగన్‌ వినిపిస్తుంది (జై బాలయ్య).
  • అపాయింట్‌మెంట్‌ లేకుండా వస్తే అకేషన్‌ చూడను, లొకేషన్‌ చూడను ఒంటి చేత్తో ఊచకోత కోస్తా.
  • మీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌.. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌.
  • భయం నా బయోడేటాలోనే లేదురా.
  • నరకడం మొదలుపెడితే ఏ పార్ట్‌ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు.

'వాల్తేరు వీరయ్య' పంచ్​లు వీర లెవల్​..

  • మీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు.
  • వీడు నా ఎర.. నువ్వే నా సొర.
  • రికార్డ్స్‌లో నా పేరు ఉండడం కాదు. నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయ్‌.
  • ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ ఇక్కడ వీరయ్య లోకల్‌.
  • ఫస్ట్‌టైమ్‌ ఒక మేక పిల్లను ఎత్తుకుని పులే వస్తాండాది.

కుటుంబ 'వారసుడు'..

  • ఇన్‌ బిజినెస్‌ ఆల్వేస్‌ బీ అలర్ట్‌. వేటగాడు తన కళ్లల్లో మట్టి పడినా కళ్లు తెరిచే ఉంచాలి.
  • వేటగాడికి వేటే వృత్తి. వెళ్లి మీ నాన్నకు చెప్పు ఈ సీట్‌లో హీట్‌ ఏంటో ఇకపై చూస్తాడు (విలన్‌ వెర్షన్‌)
  • పవర్‌ సీట్‌లో ఉండదు సర్‌. అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో ఉంటుంది. మన పవర్‌ ఆ రకం.
  • ప్రేమో, భయమో నాకిచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా నేను దాన్ని ట్రిపుల్‌గా ఇచ్చేస్తాను. నా గురించి నీకు తెలియదు కదా.
  • గ్రౌండ్‌లో ఎంతమంది ప్లేయర్స్‌ అయినా ఉండొచ్చు. కానీ ఆడియన్స్‌ అంతా ఒక్కడిని మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా?.. ఆట నాయకుణ్ని.
  • ఇల్లు అనేది ఇటుక, ఇసుకేరా వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదుగా.
  • కుటుంబం అన్నాక లోపాలుంటాయ్‌. కానీ మనకంటూ ఉండేది ఒకే ఒక కుటుంబం.

తెగించిన అజిత్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.