ETV Bharat / entertainment

Varisu trailer: తెలుగు ట్రైలర్​ ఆగయా.. దళపతి క్లాస్​ అండ్​ మాస్​​ యాక్షన్​ సూపరహే

author img

By

Published : Jan 4, 2023, 5:40 PM IST

Updated : Jan 4, 2023, 7:17 PM IST

Vijay Varisu telugu trailer
విజయ్​ వారిసు ట్రైలర్​

తమిళ స్టార్ హీరో నటించిన వారిసు చిత్రం తెలుగు, తమిళ ట్రైలర్స్​ వచ్చేశాయి. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం అదిరిపోయే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్​ 'వారిసు' తమిళ, తెలుగు ట్రైలర్స్​ వచ్చేశాయి. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం మాస్​ అండ్​ క్లాస్​ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. విజయ్‌ ఫ్యాన్స్‌ ఊహించినట్లే అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ ప్రచార చిత్రం ఉంది. ఇందులో ఫ్యామిలీ బం​ధాలను చూపిస్తూనే విజయ్‌ను బిజినెస్‌మెన్‌గా చూపించారు. విజయ్‌ అటు క్లాస్‌గా కనిపిస్తూనే మాస్‌ ఫైట్స్‌తో ఇరగదీశారు. తన మార్క్‌ డ్యాన్స్‌లతో అగదిరిపోయే స్టెప్పులు వేశారు. యోగిబాబుతో కలిసి చేసిన కామెడీ కూడా బాగానే ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్​లో విజయ్​ యాక్షన్​ హైలైట్​గా నిలిచింది. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ఫుల్​ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ విపరీతంగా లైక్స్​, కామెంట్స్ పెడుతున్నారు.

కాగా, ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించారు. విజయ్ సరసన రష్మిక కథానాయికగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రకాశ్​ రాజ్, ప్రభు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర పాటలు సోషల్​మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తూ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అవికా గోర్​ క్రేజ్​ అట్లుంటది మరి.. పాన్​ వరల్డ్​ హీరోయిన్​గా ఏకంగా 28 దేశాల్లో

Last Updated :Jan 4, 2023, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.