ETV Bharat / entertainment

మొదలైన వేసవి మారథాన్​.. ఈ అగ్ర హీరోల సందడంతా సెట్లోనే!

author img

By

Published : Feb 28, 2023, 7:17 AM IST

tollywood upcoming movies 2023
tollywood upcoming movies 2023

సంక్రాంతి తర్వాత అగ్ర హీరోల కన్ను వేసవి​, ఈ ఏడాది సెకండ్​ హాఫ్​పై పడింది. అందుగు తగ్గట్లు సన్నాహాలు ప్రారంభించారు. ఇక కథానాయకులు చిత్రీకరణకు సన్నద్ధమవుతుండడం వల్ల.. మర్చిలో పెద్ద సినిమాలు సందడి కనిపించదు. మార్చిలో షూటింగ్​ ప్రారంభించనున్న పెద్ద సినిమాలు ఇవే..

సంక్రాంతి సందర్భంగా విడుదలైన అగ్రతారల సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు అంతగా విడుదల కాలేదు. కానీ కొందరు కుర్ర హీరోలు సందడి చేశారు. కాగా, టాలీవుడ్..​ మార్చి వేసవి సినీ మారథాన్​కు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే బాక్సాఫీస్​ ముందు అగ్ర కథానాయకులు వరుస కట్టాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే వారి చిత్రాలన్నీ షూటింగ్​ స్టేజ్​లోనే ఉన్నాయి. ఈ పెద్ద సినిమాలు కొన్ని ఈ ఏడాది సెకండ్​ హాఫ్​​లో విడుదలకు ప్లాన్​ చేయగా.. మరికొన్ని సమ్మర్​, సంక్రాంతిపై కన్నేశాయి. అందుకు తగ్గట్లుగానే సెట్స్​పై ముస్తాబవుతున్నాయి. అయితే ఇప్పటికే మహేశ్​ బాబు, విజయ్​ దేవరకొండ కొత్త షెడ్యూల్​లో షూటింగ్​ ప్రారంభించారు. ఇక వెంకటేశ్​, నాగార్జున, ఎన్టీఆర్​ లాంటి అగ్ర హీరోలు మార్చిలో రంగంలోకి దిగనున్నారు.

tollywood upcoming movies 2023
వెంకటేశ్​, బాలకృష్ణ, నాగార్జున

శరవేగంగా మహేశ్​ సినిమా..
ఇటీవలే కుటంబంతో కలిసి ఫారెన్​ ట్రిప్​నకు వెళ్లొచ్చిన సూపర్​ స్టార్ మహేశ్​ బాబు.. ఇప్పుడు తన కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగారు. ఆయన 28వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ తెరకెక్కిస్తున్నారు. ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో మహేశ్​ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగర శివార్లలో వేసిన ఖరీదైన ఇంటి సెట్లో మహేష్‌, పూజా, శ్రీలీలతో పాటు మిగిలిన ప్రధాన నటీనటులపై కుటుంబ నేపథ్య సీన్స్​ తీస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కొనసాగనున్నట్లు సమాచారం. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది.

'ఖుషి'గా సమంత..
యంగ్​ హీరో విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఖుషి'.. ఇప్పటికే విడుదల కావాల్సింది. హీరోయిన్ సమంత ఆనారోగ్యంగా ఉండటం వల్ల షూటింగ్​ ఆలస్యమైంది. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్​ కూడా హైదరాబాద్​లో సోమవారం ప్రారంభమైంది. ఇక, మార్చి 8 నుంచి సమంత రెగ్యులర్​ చిత్రీకరణలో పాల్గొననుంది. ఈ కశ్మీర్​ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విజయ్​ దేవరకొండ ఆర్మీ జవాన్​గా కనిపించనున్నారు. ఈ ఏడాది సెకండ్​ హాఫ్​లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

బాలకృష్ణ వినోదం..
నటసింహ నందమూరి బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి కాంబినేషన్​లో రూపొందుతున్న కొత్త సినిమా.. మార్చి ఫస్ట్​ వీక్​లో మరో షెడ్యూల్‌ ప్రారంభించుకోనుంది. కాగా, ఇదే వారంలో హీరో నాగార్జున కొత్త చిత్రం కూడా సెట్స్​పైకి వెళ్లనుంది. రచయిత ప్రసన్న కుమార్‌ బెజవాడ డైరెక్ట్​ చేస్తున్న మొదటి చిత్రం ఇది. అయితే, మార్చి మార్చి ఫస్ట్​ వీక్​లో సినిమాను లాంఛనంగా ప్రారంభించి.. నెల మధ్య నుంచి రెగ్యులర్‌ షూటింగ్​ స్టార్ట్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించనుంది. ఇక ఈ మూవీ నాగార్డున సరసన మాజీ మిస్​ ఇండియా మానస వారణాసి ఆడిపాడనుంది. ఈ సినిమాలు ప్రముఖ హీరో నరేష్​ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

tollywood upcoming movies 2023
ఎన్టీఆర్​, విజయ్ దేవరకొండ

ఎన్టీఆర్​, వెంకటేశ్​ జోరు..
ఇక, యంగ్​ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా - కొరటాల శివ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం కూడా మార్చిలోనే ప్రారంభం కానుంది. 'జనతా గ్యారేజ్‌' తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్​లో తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల లేట్​ అయింది. దీంతో మార్చి 18న ప్రారంభమై.. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్​ చిత్రీకరణ స్టార్ట్​ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వనుంది సినిమా యూనిట్. ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక మరో అగ్ర నటుడు విక్టరీ వెంకటేష్‌ శైలేష్‌ కొలను కాంబినేషన్​లో తెరకెక్కితున్న పాన్‌ ఇండియా సినిమా 'సైంధవ్‌'. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ మూవీ.. తర్వలో సెట్స్​పైకి వెళ్లనుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీతో పాటు హీరో ఆర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.