ETV Bharat / entertainment

'నాతో జోక్స్​ వద్దు..' నెట్​ఫ్లిక్స్​పై విక్టరీ వెంకటేశ్​​ ఫైర్..

author img

By

Published : Feb 13, 2023, 8:41 PM IST

Venkatesh Warning To Netflix
Venkatesh New Web Series

ప్రముఖ ఓటీటీ​ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​పై ఫైర్​ అయ్యారు టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్​​​. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

విక్టరీ వెంకటేశ్​​​​, దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న వెబ్‌ సిరీస్‌ 'రానా నాయుడు'. సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ ఈ సిరీస్​ను డైరెక్ట్‌ చేస్తున్నారు. అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ 'రే డొనవన్‌'కు రీమేక్‌గా ఈ సినిమా​ తెరకెక్కుతోంది. కాగా, ఈ వెబ్‌సిరీస్‌ త్వరలో ప్రముక ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌పై సీరియస్​ అయ్యారు వెంకటేశ్​​​. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఇందులో చేతిలో గన్​ పట్టుకొని నెట్​ఫ్లిక్స్​ను బెదిరిస్తున్నట్లు కనిపించారు.

'పెద్ద తప్పు చేయొద్దు నెట్​ఫ్లిక్స్​.. హీరో ఎవరు?.. నేను, స్టార్​ ఎవరు?.. నేను, కిరాక్​గా కనిపించేది ఎవరు?.. నేను, ఫ్యాన్లు ఎవరు?.. నా వాళ్లే. సో.. షో పేరు కూడానాదే ఉండాలి. 'రానా నాయుడు' కాదు 'నాగా నాయుడు' అని ఉండాలని వార్నింగ్​ ఇచ్చాడు. "మజాక్​ మజాక్​ మే అబ్దుల్​ రజాక్​ హో జాయేగా" అంటూ గన్​ను టేబుల్​పై విసిరేసి భయపెట్టించే పని చేశారు విక్టరీ వెంకటేశ్​​​.' ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వెంకీ లుక్‌ అదుర్స్​ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.