ETV Bharat / entertainment

ఒక్క అడుగు వెనక్కి తగ్గిన దిల్​ రాజు.. వారసుడు రిలీజ్​ వాయిదా.. కొత్త తేదీ ఇదే..

author img

By

Published : Jan 9, 2023, 10:55 AM IST

Updated : Jan 9, 2023, 11:57 AM IST

varasudud release date postponed
varasudud release date postponed

స్టార్​ నిర్మాత దిల్​ రాజు ఓ అడుగు వెనక్కి వేశారు. వారసుడు చిత్ర రిలీజ్​ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొత్త విడుదల తేదీని తెలిపారు.

దిల్ రాజు మీడియా సమావేశం

ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్​ రాజు నిర్మించిన చిత్రం వారసుడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్డేట్​ వచ్చింది. ఈ మూవీ రిలీజ్​ను వాయిదా వేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తెలుగులో ఈ సినిమా జనవరి 14న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. కాగా, తమిళ్​లో యథావిధిగా జనవరి 11న విడుదల చేయనున్నామని చెప్పింది.

అయితే థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్​రాజు తెలిపారు. "సంక్రాంతికి విడుదలవుతున్న దిగ్గజ కథానాయకులు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. అందుకే నేను ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నాను. అందరూ బాగుండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందరూ నా మీద ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయి" అని దిల్​రాజు చెప్పారు. హిట్​ సినిమా ఎప్పుడూ రిలీజ్​ చేసినా హిట్టే అవుతుందని ఆయన అన్నారు. సినిమా తెలుగు ప్రమోషన్స్​కు త్వరలో హీరో విజయ్​ హైదరాబాద్​కు వస్తారని తెలిపారు. తమిళ్​ సినీ పరిశ్రమలో అగ్రకథానాయకులు రజినీకాంత్, సూర్య, ధనుష్​, కమల్​హాసన్ లాంటి వారితో భవిష్యత్​లో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Jan 9, 2023, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.