ETV Bharat / entertainment

Prabhas Kannappa Movie : 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్‌ రోల్​.. నెట్టింట విష్ణు హింట్​..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 11:30 AM IST

Prabhas Bhakta Kannappa Movie
Prabhas Bhakta Kannappa Movie

Prabhas Kannappa Movie : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'. ఇప్పటికే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్​మెంట్​ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నట్లు ఓ ట్వీట్​ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..

Prabhas Kannappa Movie : టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'ను తెరకెక్కించే పనుల్లో ఉన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాళహస్తి ఆలయంలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్​డేట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ నటించనున్నారని.. అది కూడా పరమశివుడి పాత్రలో కనిపించనున్నారంటూ ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్​ అయింది. దీన్ని సినిమా క్రిటిక్​ రమేశ్​ బాలా తన ట్వీట్​లో వెల్లడించగా.. దానికి.. 'హర హర మహాదేవ్‌' అని విష్ణు రిప్లై ఇచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్​.. సోషల్​ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్​ చేయడం ప్రారంభించారు. అయితే ఓ అభిమాని "భక్త కన్నప్ప ప్రాజెక్ట్ లో ప్రభాస్. నిజమేనా... నిజమైతే... సూపర్" అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్​పై ఓ ఎమోజీతో విష్ణు స్పందించారు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్​ రోల్​ కన్​ఫార్మ్​ అని ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే ఈ విషయంపై విష్ణు ఇంకా ఎటువంటి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇవ్వలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్‌ని మూడోసారి దేవుడి పాత్రలో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. ఆయన ఇప్పటికే 'ఆదిపురుష్‌'లో రాముడిగా కనిపించారు. 'కల్కి'లో విష్ణు మూర్తిగా కనిపించనున్నట్లు సమాచారం.

Kannappa Movie Cast : మరోవైపు ఈ సీనిమాలో విష్ణుతో పాటు బాలీవుడ్ స్టార్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ నటించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు రచయితలుగా వ్యవహరిస్తుండగా.. మణిశర్మ, మలయాళ మ్యూజిక్​ డైరెక్టర్​ స్టీఫెన్ దేవాసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్​తో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

"మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగిందని, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో సినిమా తీయడం వీలుకాదు. అందుకోసం ఈ సినిమా నిర్మాణానికి ఆర్నెల్లపాటు న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నాం. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. భారీ బడ్జెట్‌తో... అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నాం. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ కథకి కీలకమైన మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తారు. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం" అని ఈ సినిమా ఓపెనింగ్‌ రోజు విష్ణు తెలిపారు.

రూ.60 కోట్ల బడ్జెట్​ సినిమాలో హీరో విష్ణు

యాక్షన్​ మూవీగా మంచు విష్ణు 'భక్త కన్నప్ప'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.