ETV Bharat / entertainment

NBK107 Update ​: కర్నూలు నడిబొడ్డున బాలయ్య సింహ గర్జన!

author img

By

Published : Oct 19, 2022, 1:23 PM IST

Updated : Oct 19, 2022, 1:39 PM IST

nbk 107 update
nbk 107 update

నటసింహ బాలకృష్ణ దూకుడు పెంచారు. బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా విశ్వరూపం చూపిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'NBK 107' సినిమా నుంచి మరో అప్డేట్​ వచ్చింది. అందేంటో మీరే చూడండి..

నటసింహ బాలకృష్ణ వేగం పెంచారు. అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై అదరగొట్టేస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 'అఖండ'తో ఘన విజయం సొంతం చేసుకున్న బాలయ్య.. మరో క్రేజీ ప్రాజెక్టు 'ఎన్​బీకే 107'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్​ వచ్చింది. సంక్రాంతి కానుకగా సినిమా లోగోను విడుదల చేయనున్నారు. అక్టోబర్​ 21న రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఈ సినిమా లోగో ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్​ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

nbk 107 update
.

'ఎన్​బీకే 107' సినిమాను 'అఖండ' విడుదలైన డిసెంబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌ చేశారు మేకర్స్​. ఒకవేళ అది కాకపోతే.. సంక్రాంతి బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు. 12 జనవరి 2023న ఈ సినిమా విడుదలకు డేట్​ ఫిక్స్​ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో లేడీ పవర్​ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు అందిస్తున్నారు.

ఇవీ చదవండి : 'మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది'.. హీరోయిన్​తో ప్రేమ.. అల్లు శిరీష్​ స్పందన

బేబీ బంప్​ ట్రెండ్​.. ఖరీదైన బైక్​పై ప్రెగ్నెంట్​ లేడీ ఫొటోషూట్

Last Updated :Oct 19, 2022, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.