ETV Bharat / entertainment

'దసరా' హిట్​ అవ్వడానికి కారణమిదేనా?.. మేకింగ్​ వీడియోలో రివీల్​!

author img

By

Published : Apr 7, 2023, 8:07 PM IST

Nani Dasara Movie Making Video
నాని దసరా సినిమా మేకింగ్​ వీడియో

'దసరా' సినిమాకు సంబంధించి మూవీ మేకింగ్​ వీడియోను రిలీజ్​ చేసింది చిత్రబృందం. మీరు ఆ వీడియోను చూసేయండి.

బాక్సాఫీస్​ వద్ద దూసుకుపోతున్న 'దసరా' సినిమాకి సంబంధించి మేకింగ్​ వీడియోను విడుదల​ చేశారు మూవీ మేకర్స్​. ఈ మేకింగ్​ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ సెట్స్​లో హీరో నాని, హీరోయిన్​ కీర్తి సురేశ్​తో పాటు ఇతర ఆర్టిస్టులు కూడా చాలా డెడికేషన్​తో సినిమా కోసం కష్టపడ్డారంటూ ప్రశంసిస్తున్నారు. దీని ఫలితమే మూవీ బ్లాక్​బస్టర్​ హిట్​ కావడానికి కారణం అని అంటున్నారు. తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియోలో టెక్నీషియన్ల దగ్గర్నుంచి ఆర్టిస్టుల వరకు సెట్​లోని దుమ్ము, ధూళిని సైతం లెక్కచేయకుండా క్యారెక్టర్లలో లీనమై నటించినట్టుగా కనిపిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మేకింగ్​ వీడియో వ్యూస్​ పరంగా యూట్యూబ్​లో దూసుకుపోతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మార్చి 30న విడుదలైన రోజు నుంచే హిట్​ టాక్​ను అందుకున్న​ 'దసరా' ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్​ మార్క్​ను దాటేసింది. ఇక రానున్న వీకెండ్​లో కూడా దీని కలెక్షన్స్​ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యాచురల్​ స్టార్​ నాని ఇప్పటివరకు నటించిన సినిమాల్లో 'దసరా' ఆల్​టైమ్​ బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. దర్శకుడు సుకుమార్​ శిష్యుడిగా టాలీవుడ్​కు పరిచయమైన కొత్త డైరెక్టర్​ శ్రీకాంత్​ ఓదెల. 'దసరా'ను తెరకెక్కించిన ఈయన మొదటి సినిమాతోనే బ్లాక్​బస్టర్​ హిట్​ను కొట్టేశారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిందీ చిత్రం.

కాగా, నాని నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం 'దసరా'. ఈ సినిమాలో హీరోయిన్​గా నటించిన కీర్తి సురేశ్‌తో పాటు హీరో నాని కూడా పక్కా మాస్​ లుక్​లో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా మొత్తం 5 భాషల్లో విడుదల చేశారు. ధరణి పాత్రలో నాని, వెన్నెల క్యారెక్టర్​లో కీర్తిసురేశ్ యాక్టింగ్​ అద్భుతం అంటూ తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు. ఈ సినిమాను చూసిన అభిమానులు సహా సినీ ప్రముఖులు సైతం సోషల్‌మీడియా వేదికగా చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే వైవిధ్యమైన కథతో మొదటి సినిమాతోనే విజయం అందుకున్న శ్రీకాంత్​ ఓదెలను.. టాలీవుడ్​కు మరో అద్భుతమైన దర్శకుడు దొరికాడంటూ సినీ ప్రియులు అంటున్నారు.

'దసరా'ను వాటితో పోల్చిన నాని!
బాక్సాఫీస్​ వద్ద ఆశించిన దాని కంటే అధిక వసూళ్లను సాధిస్తోంది దసరా. ఇప్పటికే రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్​ను సాధించిన సినిమాల జాబితాలోకి చేరింది. అయితే ఈ చిత్రం రిలీజ్​కు చాలా రోజుల ముందే.. ఈ సినిమాను కేజీయఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి భారీ బడ్జెట్​ సినిమాలతో పోల్చారు నాని. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. 'దసరా' కూడా పాన్​ ఇండియా స్థాయిలో అద్భుతాలు చేస్తుందని అన్నారు. దీంతో నాని మూవీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారని కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో దీనిపై నానికి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్‌తోనే ఈ కామెంట్స్ చేశానని నాని వివరణ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.