ETV Bharat / entertainment

రమ్య రఘుపతికి కోర్టు డబుల్ షాక్​.. నరేశ్​కు లైన్ క్లియర్​!

author img

By

Published : Aug 2, 2023, 3:25 PM IST

Updated : Aug 2, 2023, 3:39 PM IST

Naresh
రమ్య రఘుపతికి కోర్టు డబుల్ షాక్​.. నరేశ్​కు లైన్ క్లియర్​!

Naresh wife ramya raghupathi : సీనియర్​ నటుడు నరేశ్​కు రెండు వేరు వేరు కేసుల్లో కోర్టులో ఊరట లభించింది. దీంతో ఆయన​ మూడో భార్య రమ్య రఘుపతికి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆ వివరాలు..

Naresh wife ramya raghupathi : సీనియర్​ నటుడు నరేశ్‌కు బెంగుళూరు సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఆయన నటించిన 'మళ్ళీ పెళ్లి' చిత్రం థియేటర్​, ఓటీటీలో విడుదల నిలిపివేయాలంటూ ఈ మధ్యనే ఆయన మూడో భార్య రమ్య రఘుపతి కోర్టులో దావా వేసింది. దాన్ని తాజాగా కోర్టు కొట్టిపారేసింది. ఇరు పక్షాల వాదనను విన్న కోర్టు, మెరిట్‌ లేని కారణంగా రఘుపతి పిటిషన్​ను కొట్టేస్తున్నట్లుగా తీర్పును ఇచ్చింది. రమ్య రఘుపతి పిటిషన్​లో ఉన్న కారణాలు సమర్థించలేనిదని పేర్కొంది.

naresh malli pelli movie : సెన్సార్‌ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్​ పరంగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా ఓ కల్పిత కథని న్యాయస్థానం తెలిపింది. సెన్సార్ బోర్డు ఓ చిత్రాన్ని.. కల్పితమని సర్టిఫికెట్​ ఇస్తే ఆ సినిమా రిలీజ్​ను ఇతర వ్యక్తులు ఎవ్వరూ అడ్డుకునేందుకు హక్కు లేదని క్లారిటీ ఇచ్చింది. నిర్మాతలు ఎక్కడైనా తన సినిమాను ప్రసారం చేసుకోవచ్చని చెప్పింది.

అందుకే కోర్టుకు.. రమ్య రఘుపతితో విడిగా ఉంటున్న నరేశ్​.. నటి పవిత్రా లోకేశ్‌తో రిలేషన్‌ షిప్​లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి 'మళ్ళీ పెళ్లి' అనే సినిమా చేశారు. తనకు డివొర్స్​ ఇవ్వకుండా.. మరో మహిళతో నరేశ్‌ ఎలా సన్నిహితంగా ఉంటారంటూ రమ్య గతంలో పెద్ద రచ్చ చేశారు. 'మళ్ళీ పెళ్లి'లో తమ వ్యక్తిగత జీవితాన్ని.. మరీ ముఖ్యంగా తనను టార్గెట్‌ చేస్తూ ఈ చిత్రాన్ని తీశారని ఆమెను కోర్టును ఆశ్రయించారు.

రమ్య రఘుపతి రాకుండా.. నరేశ్‌ ఫ్యామీలికి చెందిన మరో కేసు లోనూ ఊరట లభించింది. నరేశ్‌కు చెందిన నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి రమ్యరఘుపతి రాకూడదని.. ఆయన కుటుంబసభ్యులు గతంలో న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. నరేశ్‌ ఇంట్లోకి రమ్య రాకూడని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఆరేళ్లుగా విడివిడిగా.. అలాగే నరేశ్​, రమ్య రఘుపతి చాలా కాలంగా విడివిడిగా జీవిస్తున్నారు. ఈ జంట గత ఆరేళ్లుగా కలిసి జీవించడం లేదని తాజాగా న్యాయస్థానం నిర్ధారించింది. సుప్రీం కోర్టు నిబంధన ప్రకారం భార్యాభర్తలు రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దవుతుందని పేర్కొంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం.. నరేశ్​కు రమ్యతో డివొర్స్​కు మార్గం సుగుమం అయినట్టైంది.

ఇదీ చూడండి :

Malli Pelli Review : నరేశ్​-పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి' ఎలా ఉందంటే?

'నరేశ్​లో బాగా నచ్చింది అదే... అంతకన్నా నాకు ఇంకేం కావాలి?'

Last Updated :Aug 2, 2023, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.