ETV Bharat / entertainment

మిస్టరీని ఛేదించేందుకు వెళ్లిన నాగ చైతన్య - జర్నలిస్ట్​ సాగర్​కు ఏమైంది?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 4:36 PM IST

Naga Chaitanya Dhootha Trailer
Naga Chaitanya Dhootha Trailer

Naga Chaitanya Dhootha Trailer : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య లీడ్​ రోల్​లో తెరకెక్కిన వెబ్​సిరీస్​ 'దూత'. మిస్టరీ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సిరీస్​ నుంచి తాజాగా ట్రైలర్​ను విడుదల చేశారు మూవీ మేకర్స్​. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Naga Chaitanya Dhootha Trailer : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య తొలిసారి వెబ్​సిరీస్​లో నటించారు. 'దూత' అనే టైటిల్​తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్​.. డిసెంబర్‌ 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అయితే నేడు (నవంబర్‌ 23) చైతూ బర్త్​డే స్పెషల్​గా.. ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

Dhootha Story In Telugu : ఈ 'దూత' సిరీస్ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇందులో చైతూ ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తారు. 'సమాచార్' అనే న్యూస్​ పేపర్​లో సాగర్ అనే జర్నలిస్టుగా ఆయన కనిపించారు. అయితే నగరంలో జరిగే వరుస హత్యలకు న్యూస్‌ పేపర్​లో వచ్చే కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు ఆయన కనిపెడుతారు. ఆ హత్యల వెనకాల ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ క్రమంలో ఆయనపై ఓ నేరారోపణ పడుతుంది. అయితే వాటన్నింటికి భయపడకుండూ చైతూ సాహాయం చేసి మిస్టరీని కనుగునేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆయన చేసిన సాహాసాలు ఎలాంటివి..? అసలు చైతూ మీద ఆ నేరం ఎందుకు పడుతుంది..? చిక్కుల్లో పడిన ఒక జర్నలిస్ట్‌ వాటి నుంచి బయటపడ్డారు అనేది తెలియాలంటే డిసెంబర్‌ 1 వరకు వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Dhootha Telugu Movie Cast And Crewcrew : ఇక నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' లాంటి సినిమాలను తెరకెక్కించిన విక్రమ్‌ కె. కుమార్‌ ఈ 'దూత'ను రూపొందించారు. ఇందులో చైతూతో పాటు ప్రియ భవానీ శంకర్‌, పార్వతీ తిరువోతు, ప్రాచీ దేశాయ్‌, తరుణ్‌ భాస్కర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. చైతూకి ఇది ఓ కొత్త ప్రయత్నం. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్​.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

Naga Chaitanya Movies : ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. చైతూ ప్రస్తుతం 'తండేల్​' అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న‌ ఈ సినిమాలో చైతూ సరసన కోలీవుడ్ స్టార్​.. సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఇది రెండో సినిమా కావడం విశేషం. చందూ ముందేటి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ కోసం నాగ చైతన్య.. తనని తాను మార్చుకున్నారు. ఫిట్​నెస్​ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గడ్డం, జుట్టు పెంచి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు.

నాగ చైతన్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ - ఆ క్రేజీ లుక్​లో పోస్టర్ రివీల్​!​

'టెక్నాలజీని చూస్తే భయమేస్తోంది'- రష్మిక 'డీప్​ ఫేక్​' వీడియోపై నాగచైతన్య స్పందన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.