ETV Bharat / entertainment

ఆ సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చేసిన తమన్​.. కన్నీళ్లు విలువైనవంటూ ట్వీట్​!

author img

By

Published : Jan 11, 2023, 1:51 PM IST

Updated : Jan 11, 2023, 1:58 PM IST

thaman about varisu movie
thaman

టాలీవుడ్​ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్​.. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఓ చిత్రాన్ని చూసి ఏడ్చేశారట. ఆ విషయాన్ని ట్విట్టర్​లో తెలిపారు. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే ??

కోలీవుడ్‌ నటుడు విజయ్‌పై ఉన్న అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేశారు సంగీత దర్శకుడు తమన్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'వారిసు'. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతోంది. తాజాగా చిత్రాన్ని చూసిన తమన్‌ భావోద్వేగానికి గురై ట్వీట్‌ చేశారు. "విజయ్‌ అన్నా.. సినిమాలోని ఎమోషనల్‌ సీన్స్‌ చూసి ఏడ్చేశా. కన్నీరు విలువైంది. వారిసు సినిమా నా హృదయాన్ని హత్తుకుంది. ఇంతటి పెద్ద అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్‌. లవ్‌ యూ అన్నా" అని తమన్‌ పేర్కొన్నారు. విజయ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు.

  • Anna @actorvijay Anna ❤️

    I cried From the Heart Watching all the Emotional Scenes dear anna ❤️ Tears Are Precious 🥹#Varisu Movie Is My family Anna It’s Close To My heart ❤️ Thanks For Giving me This biggest Opportunity dear Anna Love U 🎛️🎧🥁#BlockbusterVarisu FROM TOM 😊 pic.twitter.com/QgZdOdGR9G

    — thaman S (@MusicThaman) January 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

యాక్షన్‌కంటే ఎక్కువగా ఈ సినిమాలో ఎమోషనే ఉంటుందని చిత్ర బృందం ప్రచారంలో భాగంగా తెలియజేసింది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కించారు. రష్మిక కథానాయిక. ఈ సినిమాలో హీరో సోదరులుగా సీనియర్‌ హీరో శ్రీకాంత్‌, 'కిక్' శ్యామ్‌ నటించారు. శరత్‌కుమార్‌, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో 'వారసుడు' పేరుతో జనవరి 14 నుంచి ఈ సినిమా సందడి చేయనుంది.

Last Updated :Jan 11, 2023, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.