ETV Bharat / entertainment

మహేశ్ బాబు 'SSMB28' లేటెస్ట్ అప్డేట్.. త్వరలోనే..

author img

By

Published : Dec 10, 2022, 9:17 PM IST

mahesh
మహేశ్‌ బాబు

త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి లేటెస్ట్​ అప్టేట్​ వచ్చేసింది. అదేంటంటే?

SSSMB 28 Update: సూపర్​స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇదే విషయంపై మూవీ టీమ్​ సైతం ఒక క్లారిటీ ఇచ్చింది. జనవరిలో 'ఎస్ఎస్ఎంబీ28' రెండో షెడ్యూల్​ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఇక మూవీ టీమ్​తో కలిసి మహేశ్‌ బాబు క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.