ETV Bharat / entertainment

అన్ని సినిమాలు ఆడాలి.. అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుంది: బాలకృష్ణ

author img

By

Published : Jun 30, 2023, 9:59 AM IST

Updated : Jun 30, 2023, 10:11 AM IST

Rudrangi Movie Pre Release Event
Rudrangi Movie Pre Release Event

Rudrangi Movie Pre Release Event : అన్ని సినిమాలు ఆడితేనే చిత్ర పరిశ్రమ వర్ధిల్లుతుందని నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. నటనంటే అరవడం, ఏడవడం మాత్రమే కాదని.. అది ఒక పరకాయ ప్రవేశం అని అన్నారు. 'రుద్రంగి' సినిమా ప్రీ రిలీజ్​​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే?

Rudrangi Pre Release Event : నటన అంటే అరవడమో.. ఏడవడమో.. నమ్మించడమో కాదని.. నటనంటే ఒక పరకాయ ప్రవేశం అని చెప్పారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఏ పాత్రలోకైనా వెళ్లినప్పుడు.. ఆ పాత్ర తాలూకూ అనుభవాలను ఆస్వాదిస్తూ.. అందులో జీవించాలని.. అలా ఏ పాత్రలోనైనా సులభంగా ఒదిగిపోగల గొప్ప భారతీయ నటుల్లో జగపతిబాబు ఒకరని బాలకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన 'రుద్రంగి' సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య ఈ మేరకు మాట్లాడారు.

rudrangi movie cast
రుద్రంగి సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​

Rudrangi Movie Balakrishna : 'నా దృష్టిలో 'రుద్రంగి' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. అంతకు మించి. కొన్ని చిత్రాలు వినోదం కోసం తీస్తారు. మరికొన్ని సినిమాలు మన ముందే ప్రత్యక్షంగా జరుగుతున్నట్లు.. మనం అందులో లీనం అయ్యేలా చేస్తాయి. 'రుద్రంగి' రెండో కోవకు చెందింది. 'రుద్రంగి' ప్రచార చిత్రం చూస్తుంటే నటీనటులు ఎవరూ కనపడట్లేదు. నాకు కేవలం పాత్రలే కనిపిస్తున్నాయి. ఈ సినిమా కచ్చితంగా చాలా మంచి విజయం సాధిస్తుంది. నేను.. జగపతిబాబు ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు చేశాం. కళామ్మతల్లి చల్లని చూపు వల్లే మాకు అది సాధ్యమైంది' అని బాలకృష్ణ అన్నారు.

rudrangi mov jagapathibabu balakrishna
బాలకృష్ణ, జగపతిబాబు

'ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూడటం పెద్ద ఛాలెంజ్‌. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీని నిలబెట్టడానికే మేమంతా పని చేస్తున్నాం. అన్ని చిత్రాలు మంచిగా ఆడితేనే చిత్రసీమ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ప్రస్తుతం టాలీవుడ్​.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటోంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలను సమపాళ్లలో అందిస్తున్న తెలుగు చిత్ర సీమకు.. సాటి, పోటీ లేదు' అని బాలకృష్ణ తెలుగు సినిమాలు విజయగాథను కళ్లకు కట్టారు. దీంతో పాటు ఈ 'రుద్రంగి' సినిమాలో నటించిన మమతా మోహన్​ దాస్​ను వీరవనితగా అభివర్ణించారు. ఆమె ఎంతో ధైర్యంగా క్యాన్సర్​ను ఎదుర్కొని ఆందరికీ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

rudrangi movie cast release date
రుద్రంగి

Rudrangi Movie Cast : ఇక, 'రుద్రంగి' సినిమా విషయానికొస్తే.. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నిర్మించారు. ఆశిష్‌ గాంధీ, మమతా మోహన్‌ దాస్‌, విమలా రామన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Jun 30, 2023, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.