ETV Bharat / entertainment

ఆస్కార్​ బరిలో 'RRR', 'కాంతార'.. ఆ జాబితా విడుదల చేసిన అకాడమీ

author img

By

Published : Jan 10, 2023, 12:41 PM IST

Updated : Jan 10, 2023, 1:06 PM IST

oscar remainders list  2023
oscar remainders list

ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయిన చిత్రాల తుది జాబితాను 'ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌' ఈనెల 24న ప్రకటించనుంది. ఈ క్రమంలో ఆస్కార్‌ అవార్డులకు పోటీపడేందుకు అవకాశం ఉన్న 301 చిత్రాలతో రిమైండర్‌ జాబితాను అవార్డ్స్‌ కమిటీ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్‌ మేనియా మొదలైంది. ఈనెల 24న ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయిన చిత్రాల తుది జాబితాను 'ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌' ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ అవార్డులకు పోటీపడేందుకు అవకాశం ఉన్న 301 చిత్రాలతో రిమైండర్‌ జాబితాను అవార్డ్స్‌ కమిటీ వెల్లడించింది. అందులో 'ఆర్​ఆర్​ఆర్​', కన్నడ చిత్రం కాంతార సహా 4 భారతీయ చిత్రాలు ఉన్నాయి.

రిమైండర్‌ జాబితాలో ఉన్న చిత్రాలు ఆస్కార్‌ అవార్డుల కోసం వివిధ విభాగాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ తుది జాబితాలో చోటు దక్కుతుందన్న గ్యారంటీ లేదు. పాన్‌ నలినీస్‌ దర్శకత్వం వహించిన నాటకం 'ఛెల్లో షో', ఆలియాభట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం గంగూబాయి కాఠియావాడి, వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ' ద కశ్మీర్‌ ఫైల్స్‌', మరాఠీ టైటిల్స్‌-'మీ వసంతరావ్‌', 'తుజ్యా సతీ కహీ హై', ఆర్‌.మాధవన్‌ కథానాయకుడుగా తెరకెక్కిన 'రాకెట్రీ', 'ఇరవిన్‌ నిఝాల్‌', కన్నడ చిత్రం 'విక్రాంత్‌ రోనా', కాంతార ఆస్కార్‌ అవార్డులకు భారత్‌ తరఫున అధికారికంగా ఎంట్రీ సాధించాయి. డాక్యుమెంటరీ విభాగంలో 'ఆల్‌ దట్‌ బ్రితెస్‌', 'ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌'లో ఎంట్రీ పొందాయి.

ఆస్కార్‌లో షార్ట్‌ లిస్టయిన 4 విభాగాల్లో 'ఛెల్లో షో', 'ఆర్​ఆర్​ఆర్​', 'ఆల్‌ దట్‌ బ్రితెస్‌', 'ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌' చోటు దక్కించుకున్నాయి. ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ పది విభాగాల షార్ట్‌ లిస్ట్‌లను డిసెంబర్‌లో ప్రకటించింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో 'ఛెల్లో షో', తెలుగు బ్లాక్‌బస్టర్‌ మూవీ 'ఆర్ఆ​ర్‌ఆర్​'లోని నాటు నాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఎంట్రీ సాధించింది. 'ఆల్‌ దట్‌ బ్రితెస్‌' డాక్యుమెంటరీ ఫీచర్‌గా, 'ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌' డాక్యుమెంటరీ షార్ట్‌ కేటగిరీలో ఎంట్రీ పొందాయి. నామినేషన్లకు ముందు 3 ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ల్లో భారత్‌ చేరటం ఇదే మొదటిసారి.

Last Updated :Jan 10, 2023, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.