ETV Bharat / entertainment

దిగొచ్చిన HCA సంస్థ.. ఎన్టీఆర్‌కు స్పాట్​లైట్​ అవార్డు పంపిస్తున్నట్లు ట్వీట్!

author img

By

Published : Mar 3, 2023, 4:12 PM IST

hca
hca

టాలీవుడ్​ స్టార్​ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఆర్​ఆర్​ఆర్​ చిత్రం ద్వారా గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే చరణ్ ఇటీవలే హెచ్​సీఏ స్పాట్‌లైట్ అవార్డ్ అందుకోగా.. ఎన్టీఆర్‌కు వీలుపడలేదు. అయితే ఎన్టీఆర్​ ఆ అవార్డు ఎప్పుడు అందుకోనున్నారంటే?

దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్ఆర్​ చిత్రం తర్వాత టాలీవుడ్​ స్టార్​ హీరోలు జూనియర్​ ఎన్టీఆర్​, రామచరణ్​ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ఆ సినిమా ప్రదర్శించిన ప్రతీ దేశంలో ఊహించని రెస్పాన్స్​ అందుకుంటోంది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఖాతాలో వేసుకుంది. ఇటీవలే లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన హెచ్​సీఏ అవార్డ్స్ వేడుకలో ఐదు కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకుంది ఆర్​ఆర్​ఆర్. డైరెక్టర్​ రాజమౌళి, మ్యూజిక్​ డైరెక్టర్​ కీరవాణి తదితరులు పాల్గొన్న ఈ వేడుకల్లో రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డ్ అందుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకను మిస్సయ్యారు.

మరోవైపు స్పాట్ లైట్ అవార్డ్.. రామ్ చరణ్ ఒక్కరికే వచ్చినట్లుగా సోషల్​ మీడియాలో హైప్ క్రియేట్ కావడం పట్ల జూనియర్ ఎన్టీఆర్​ అభిమానులు నెట్టింట రచ్చ చేశారు. దీంతో హెచ్​సీఏ అవార్డ్స్ జ్యూరీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఆర్​ఆర్​ఆర్​లో కీలక పాత్రలు పోషించినందుకు జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ ఇద్దరికీ స్పాట్‌లైట్ అవార్డ్స్ ప్రకటించినట్లు తెలిపింది. వచ్చే వారం వారిద్దరికీ అవార్డులను పంపనున్నట్లుగా ట్విట్టర్‌లో ప్రకటించింది.

వాస్తవానికి సోదరుడు తారకరత్న మరణంతో హీరో ఎన్టీఆర్.. హెచ్​సీఏ అవార్డ్స్ వేడుకకు వెళ్లలేకపోయారు. ఇప్పుడు ఇక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తయినందున మార్చి 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు మార్చి 5 లేదా 6 తేదీల్లో ఆయన అమెరికాకు వెళ్లనున్నారట.

ఇకపోతే, కొరటాల శివతో ఎన్టీఆర్​ చేయాల్సిన NTR30 మూవీ మార్చి 18న సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే అంతకుముందే కొన్ని అప్‌డేట్స్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆమె బర్త్‌డే (మార్చి 6) సందర్భంగా అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.