ETV Bharat / entertainment

సంక్రాంతి బరిలో సౌత్​ సినిమాలు - కలెక్షన్స్​లో టాప్​ ఏదంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 10:38 AM IST

Updated : Jan 18, 2024, 10:46 AM IST

2024 South India Sankranthi Movies
2024 South India Sankranthi Movies

Highest Collection Movies In Sankaranti 2024 : ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి సౌత్​ నుంచి ఏడు సినిమాలు వచ్చాయి. భారీ అంచనాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ సినిమా ఎంత మేర కలెక్షన్స్ సాధించాయంటే?

2024 South India Sankranthi Movies : ఇప్పటి కాలంలో సౌత్ సినిమాలకు పాన్ ఇండియాలో మంచి క్రేజ్​ పెరిగిపోయింది. ప్రాంతంతో తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్​ సాధిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. దీంతో మూవీ లవర్స్​ కూడా పాన్ ఇండియా సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మరోవైపు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన స్టార్స్​ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సంక్రాంతి బాక్సాఫీస్​ ముందుకొచ్చారు. అలా సంక్రాంతి రేసులో ఈ సారి సౌత్ నుంచి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో తెలుగు నుంచి నాలుగు, తమిళం నుంచి మూడు సినిమాలు ఉన్నాయి. డిఫరెంట్​ జానర్స్​తో భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. అయితే ఈ రేసులో కొన్ని బ్లాక్​ బస్టర్ సక్సెస్​ అందుకుని సంక్రాంతి విన్నర్​గా నిలవగా, మరికొన్ని మాత్రం మిక్స్​డ్​ టాక్ అందుకుని సాగుతున్నాయి.

సంక్రాంతి కానుకగా తొలుత 'హనుమాన్​', 'గుంటూరు కారం' సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి. భారీ పోటీ నడుమ ఈ రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే గుంటూరు కారం ప్రస్తుతం టాక్​ పరంగా మిక్స్​డ్​ రిజల్ట్స్ అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా జోరు కొనసాగిస్తోంది. అలా ఇప్పటి వరకు 'గుంటూరు కారం' సుమారు రూ. 140 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుందని ట్రేడ్​ వర్గాల మాట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు పండుగ విన్నర్​ 'హనుమాన్' మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్​ క్రియేట్​ చేస్తోంది. అటు టాక్​తో పాటు ఇటు కలెక్షన్లు పరంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇప్పటి వరకు సూమారు రూ. 116 కోట్ల గ్రాస్​ని వసూళ్లు చేసింది. ప్రస్తుతం హౌస్​ఫుల్ కలెక్షన్స్​తో సందడి చేస్తోంది. అటు నాగార్జున నా సామి రంగ కూడా మంచి టాక్ అందుకుని రన్ అవుతోంది. అయితే 'సైంధవ్' మాత్రం అటు కలెక్షన్​తో పాటు ఇటు టాక్​ పరంగా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే - అక్కడి పొంగల్​ రేసులో ఈ సారి రెండు సినిమాలు పోటీపడ్డాయి. అందులో ధనుశ్​ 'కెప్టెన్​ మిల్లర్'​తో పాటు శివ కార్తికేయన్​ 'అయలాన్​' ఉన్నాయి. అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన 'కెప్టెన్ మిల్లర్' మాత్రం బాక్సాఫీస్ వద్ద స్లోగా నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ సుమారు రూ. 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది బడ్జెట్ తో పోల్చుకుంటే చాలా తక్కువ అంటూ మూవీ క్రిటిక్స్​ విశ్లేషిస్తున్నారు. అయితే నెమ్మదిగా ఈ మూవీ వేగం పుంజుకునే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలుగులో రిలీజ్ కాకపోవడం కూడా ఈ మూవీ కలెక్షన్స్ తక్కువగా కనిపించడానికి ఒక కారణమని అంటున్నారు.

ఇక శివ కార్తికేయన్ 'అయలాన్' సినిమా ఇప్పటి వరకు సుమారు రూ. 47.7 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమా అక్కడి ఆడియెన్స్​ను ఆకట్టుకుని థియేటర్లలో మంచి టాక్​తో నడుస్తోంది. త్వరలో తెలుగులో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రెండు సినిమాలతో పాటు విడుదలైన విజయ్​ సేతుపతి 'మెర్రీ క్రిస్మస్​' మూవీ మిక్స్​డ్​ టాక్​తో సరిపెట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వీళ్లు సౌత్​ ఇండియన్ ఫిల్మ్​ సూపర్ హీరోస్​!

'హనుమాన్'​- నెక్ట్స్​ చిరంజీవి, నిఖిల్ కూడా ఇదే బాటలో!

Last Updated :Jan 18, 2024, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.