ETV Bharat / entertainment

నాని.. మొన్న మహేశ్​తో.. ఇప్పుడు ఎన్టీఆర్​తోనా!

author img

By

Published : May 26, 2022, 6:24 AM IST

Hero Nani in   Prasanth Neel NTR movie
నాని.. మొన్న మహేశ్​తో.. ఇప్పుడు ఎన్టీఆర్​తోనా

హీరోలు మహేశ్​బాబు, ఎన్టీఆర్​ సినిమాల్లో నాని ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్​మీడియా ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

దర్శకుడు ప్రశాంత్​ నీల్​ నేచురల్ స్టార్​ నానితో ఓ సినిమా చేయబోతున్నారని నిన్నమొన్నటి వరకు ప్రచారం సాగింది. అయితే ఇప్పుడీ ప్రచారం రూటు మారింది. ఇటీవలే ప్రశాంత్​.. ఎన్టీఆర్​తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మాతృభూమి కోసం పోరాడిన ఓ యోధుడి క‌థ‌తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్లుగా తెలిపారు. అయితే ఇందులో మరో హీరోకు చోటు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోనే నాని కనిపించనున్నారంటూ కొత్త ప్రచారం మొదలైంది! సోషల్​మీడియాలో ఇప్పుడు దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు సూపర్​స్టార్​ మహేశ్​బాబు-త్రివిక్రమ్​ సినిమాలో నాని కనిపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. నాని అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

కాగా, ఎన్టీఆర్​-ప్రశాంత్​ నీల్​ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ప్రశాంత్ ప్రస్తుతం సలార్​తో బిజీగా ఉండగా.. తారక్​ కొరటాల శివతో ఓ ప్రాజెక్ట్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి: లైఫ్​లో కాంప్రమైజ్​ అవ్వన్నంటున్న చైతూ.. 'డెడ్​' అంటూ సామ్ పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.