ETV Bharat / entertainment

రూ.1000 కోట్లతో డైరెక్టర్​ శంకర్​ సినిమా.. హీరో అతడే?

author img

By

Published : Sep 11, 2022, 4:54 PM IST

Updated : Sep 12, 2022, 8:08 AM IST

director shankar
దర్శకుడు శంకర్​

డైరెక్టర్​ శంకర్​ మరో సంచలనానికి తెర తీయనున్నారని తెలుస్తోంది. ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని టాక్​. హీరో ఎవరంటే?

కోలీవుడ్‌ దర్శకుడు శంకర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారీ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​. ఇండియ‌న్ సినిమాల్లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని ద‌క్కించుకున్న ఈయన. మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాల‌కు భారీ స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను అద్ది సక్సెస్​ను అందుకున్నారు.

అయితే ఇప్పుడాయన మరో సంచలనానికి తెర తీయనున్నారని తెలుస్తోంది. ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని టాక్​. ఎస్‌. వెంకటేశ్‌ చారిత్రక నేపథ్యంలో రాసిన నేర్పాలి అనే నవలను సినిమాగా తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ భారీ బడ్జెట్​ చిత్రంలో సూర్య హీరోగా నటించనున్నట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మూవీ అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, శంకర్‌ ప్రస్తుతం.. రామ్‌చరణ్​తో ఆర్​సీ 15 సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు కమల్​హాసన్ హీరోగా ఇండియన్‌-2 రూపొందిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత సూర్యతో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.

ఇదీ చూడండి: టర్కీ నుంచి కృష్ణంరాజుకు బాలయ్య నివాళి.. మూవీటీమ్​తో కలిసి మౌనం..

Last Updated :Sep 12, 2022, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.