ETV Bharat / entertainment

నాని 'దసరా' సాంగ్​ వచ్చేసింది.. డప్పుల్తో మోత మోగిపోతోంది..!

author img

By

Published : Oct 3, 2022, 5:22 PM IST

Updated : Oct 3, 2022, 5:51 PM IST

actor nanis dasara movie first single released
actor nanis dasara movie first single released

తెలుగు యువ కథానాయకుడు నాని నటించిన కొత్త చిత్రం 'దసరా'. ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్​.

తెలుగులో మంచి నటనతో తన గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్​ను కూడా సంపాదించుకున్నారు. అతడి నుంచి రాబోతున్న మరో చిత్రం 'దసరా'. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి పాటను విడుదల చేశారు. ధూం.. ధాం.. దోస్తాన్​.. అంటూ సాగే ఈ పాట శ్రోతల్ని ఆత్యంతం ఆకట్టుకుంటోంది. మంచి బీట్​తో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటను మాస్​ సింగర్​ రాహుల్​ సిప్లిగండ్​ అద్భుతంగా పాడారు. ఈ సినిమాకు సంతోష్​ నారాయణన్​ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జంటగా అందాల రాసి కీర్తి సురేష్​ నటిస్తోంది.

ఈ సినిమాలో సముద్ర ఖని, సాయి కుమార్​, జరీనా వాహబ్​ లాంటి నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సత్యన్ సూర్యన్​ సినిమాటోగ్రఫీ చేశారు. ఎడిటర్​ నవిన్​ నూలి. 'దసరా' తెలుగుతో పాటు తమిళ్​, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాచురల్​ స్టార్​ నాని నుంచి మంచి మాస్​ ఎంటర్​ట్రైనర్​గా ఈ చిత్రం రూపొందుతోంది. అచ్చమైన తెలంగాణ మాండలికంలో నాని అద్భుతంగా డైలాగులు చెప్పాడు. తెలంగాణ సంస్కృతి ఈ సినిమాలో ప్రతిబింబించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: Boxoffice war: ఈ వారమే గాడ్​ఫాదర్​-ఘోస్ట్​.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే?​

Adipurush: హనుమంతుడిగా నటించింది ఎవరో తెలుసా?

Last Updated :Oct 3, 2022, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.