ETV Bharat / crime

Sexual assault: భర్త ఇంట్లోలేని సమయంలో.. వాలంటీరు ప్రవేశించి..

author img

By

Published : Jan 9, 2022, 7:23 PM IST

Sexual assault: భర్త ఇంట్లోలేని సమయంలో.. వాలంటీరు ప్రవేశించి..
Sexual assault: భర్త ఇంట్లోలేని సమయంలో.. వాలంటీరు ప్రవేశించి..

Sexual assault: ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయాల్సిన ఓ వాలంటీరు.. దుర్మార్గానికి పాల్పడ్డాడు. తన వార్డులోని ఓ వివాహిత ఫోన్​కు అసభ్యకరమైన సందేశాలు పంపించి.. భర్త లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.

Sexual assault: లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను చేరవేయాల్సిన ఓ వాలంటీరు.. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన వార్డులోని ఓ వివాహిత ఫోన్​కు అసభ్యకరమైన సందేశాలు పంపించడమే కాకుండా.. భర్త లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక పరిధిలోని ఆరో వార్డులో.. జమాల్ వలి వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అదే వార్డుకు చెందిన ఓ వివాహితకు ఫోన్​ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపించాడు.

భర్త లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె మూడో పట్టణ పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ ఆనందరావు ఈ వివరాలు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.