ETV Bharat / crime

Road Accident: ఆరు లారీలు ఒకదానికొకటి ఢీ.. మధ్యలో నుజ్జునుజ్జయిన కారు

author img

By

Published : Mar 26, 2022, 3:08 PM IST

Road Accident: ఒకదానికొకటి ఢీకొన్న 6 లారీలు.. మధ్యలో నుజ్జునుజ్జయిన కారు
Road Accident: ఒకదానికొకటి ఢీకొన్న 6 లారీలు.. మధ్యలో నుజ్జునుజ్జయిన కారు

Road Accident: ఆరు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని గామన్ వంతెనపై చోటుచేసుకుంది. ప్రమాదంలో లారీ మధ్య ఓ కారు నుజ్జునుజ్జుయింది. ఈ ఘటనలో ఒక వ్యాన్‌ నుంచి పాస్పరస్ ట్రైక్లోరైడ్ ద్రావణం లీకవుతోంది.

Road Accident: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని గామన్ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. కానీ లారీల మధ్య ఓ కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఒక వ్యాన్‌ నుంచి పాస్పరస్ ట్రైక్లోరైడ్ ద్రావణం లీకవుతోంది.

వ్యానులో 200 కేజీల 50 గ్రాముల ఫాస్పరస్ ట్రైక్లోరైడ్​ను పోలీసులు గుర్తించారు. ద్రావణం నుంచి విషతుల్యమైన టాక్సిన్లు వెలువడుతుండటంతో.. రసాయన నియంత్రణ నిపుణులు లీక్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రేన్ల సాయంతో వాహనాలను పోలీసులు తొలగిస్తున్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.