ETV Bharat / crime

లారీని తప్పించబోయి డివైడర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

author img

By

Published : Mar 28, 2021, 10:35 AM IST

accident, bus accident
ఆర్టీసీ బస్సుకు ప్రమాదం, రోడ్డు ప్రమాదం

ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు డివైడర్ మీదకు ఎక్కిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ సమీపంలోని జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బోథ్ మండలం సోన్ గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. నేరడిగొండ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డివైడర్ మీదకు ఎక్కింది.

ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారందర్నీ మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. పెనుప్రమాదం తప్పడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.