ETV Bharat / crime

లోదుస్తుల్లో భారీగా బంగారం.. సీజ్ చేసిన అధికారులు

author img

By

Published : Jul 22, 2022, 10:58 AM IST

Gold Smuggling at Hyderabad Airport
Gold Smuggling at Hyderabad Airport

Gold Smuggling at Hyderabad Airport : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.1.87 కోట్లు విలువ చేసే 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా.. మరో వ్యక్తి వద్ద 740 గ్రాముల పసిడిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

  • On 21.07.2022, Air Intelligence Unit of Hyderabad Customs, RGIA, @hydcus has apprehended two male pax who had arrived by EK-526 from Dubai and tried to smuggle 3591 grams gold, valued at Rs. 187 lakhs by concealing in his pants ,undergarments and rectum pic.twitter.com/qMvkkZqJk4

    — Hyderabad Customs (@hydcus) July 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Gold Smuggling at Hyderabad Airport : హైదరాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.1.87 కోట్లు విలువ చేసే 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఒకరు మలద్వారంలో.. మరొకరు లోదుస్తుల్లో బంగారం దాచినట్లుగా అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా పసిడిని తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

  • on 21.07.2022, a male passenger who has arrived at Hyderabad by AI-952 Flight was intercepted by the officers of Hyderabad customs @hydcus , he has concealed the gold in metal cylinders of Exhaust Fan, Ab Roller & Electric juicer. The net weight of the gold seized is 740 grams pic.twitter.com/Qcm7ZCYl6v

    — Hyderabad Customs (@hydcus) July 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే మరో వ్యక్తి అక్రమంగా బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎలక్ట్రిక్ జూసర్‌లో బంగారం దాచిపెట్టి తీసుకొస్తుండగా గుర్తించారు. అతని నుంచి 740 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. నిందితుణ్ని అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.