ETV Bharat / crime

నకిలీ ధ్రువపత్రాలు తయారుచేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్టు

author img

By

Published : Dec 15, 2022, 5:31 PM IST

fake
fake

Fake certificates gang arrest: వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. గోడాడీ వెబ్​సైట్ల ద్వారా నకిలీ సర్టిఫికెట్ సృష్టిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

Fake certificates gang arrest: యూనివర్సిటీల నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్న ముఠా గట్టురట్టయింది. దాదాపు 13 విశ్వవిద్యాలయాలకు చెందిన 140 బోగస్ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఇప్పటికి 30మందికి ఇచ్చారని మధ్య మండల డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ నకిలీ సర్టిఫికెట్స్ దందా చలామణి చేస్తున్న 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. కొంతమంది యూనివర్సిటీ కంప్యూటర్ ఆపరేటర్స్​తో కుమ్మకై ఈ దందా చేస్తున్నారని తెలిపారు. నిందితులపై హైదరాబాద్​లోని పలు పోలీసుస్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

నకిలీ సర్టిఫికెట్స్ ద్వారా ఎలాంటి ఉద్యోగం పొందిన తరువాత అనేక ఇబ్బందులకు గురువుతారని తెలిపారు. ఒక్కొక్క సర్టిఫికెట్​కు రూ.50వేల నుంచి లక్ష వరకు ముఠా సభ్యులు వసూలు చేశారని... మరో ఇద్దరు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలిపారు. నలుగురు నిందితులైనా మహమ్మద్ ఏతేషాం ఉద్దిన్ ఉస్సేన్, మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మొహమ్మద్ అల్తాఫ్ అహ్మద్, మొహమ్మద్ ఇమ్రాన్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.