ETV Bharat / crime

పర్వతగిరి పోలీస్​ స్టేషన్​లో వ్యక్తి బలవన్మరణం

author img

By

Published : Jul 16, 2021, 4:41 PM IST

Updated : Jul 16, 2021, 10:40 PM IST

suicide
suicide

16:37 July 16

Suicide in police station : పర్వతగిరి పోలీస్​ స్టేషన్​లో వ్యక్తి బలవన్మరణం

పర్వతగిరి పోలీస్​ స్టేషన్​లో వ్యక్తి బలవన్మరణం

  వరంగల్ గ్రామీణ జిల్లాలో దారుణం జరిగింది. పర్వతగిరి పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యక్తి  పురుగుల మందు తాగి కుప్పకూలిపోయాడు (Suicide in police station). ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు.  

 తన కుమార్తె (మైనర్ బాలిక ) తప్పిపోయిందని చౌటపల్లికి చెందిన మంత్రి నాగరాజు పదిరోజుల క్రితం పర్వతగిరి పోలీస్​ స్టేషన్​లో  ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కేసు పెట్టి పదిరోజులైనా తమ కుమార్తె ఆచూకీ లభించకపోవడం వల్ల పోలీస్​ స్టేషన్​ ఆవరణలోనే పురుగుల మందుతాగి కుప్పకూలిపోయాడు. గుర్తించిన పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. కుమార్తె జాడకోసం తీవ్రంగా పరితపించిన నాగరాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

 'మా బిడ్డ కనిపించకుండా పోయింది. ఇవాళ్టికి పదిరోజులైంది. ఒక వ్యక్తి మీద అనుమానంతో తీసుకొచ్చినప్పుడు అతడిని లాకప్​లో ఉంచితే బాగుండు. ఉంచకుండా అతడిని పంపించేశారు. మళ్లి ఇంకొకరిని పట్టుకొస్తే.. అతడిని కాసేపు విచారించి వదిలేస్తున్నారు. నేను ఎంతమందిని తీసుకొస్తున్నా.. సార్​ నన్ను పట్టించుకోవడం లేదని అతను ఆలోచన పెట్టుకున్నాడు. వాస్తవానికి సర్​ పట్టించుకున్నారు. అందర్నీ పట్టుకొస్తుంటే ఎందుకిలా వదిలేస్తున్నారనేది అతనికి అర్థం కాలేదు. పోలీసులు పట్టించుకోకపోవడం అనేది ఏమీలేదు. మేము వెళ్లగానే పిటిషన్​ తీసుకున్నారు. మేము ఎవరిపేరు చెబితే వారిని తీసుకొచ్చి విచారించారు. అయితే ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. మేము బయపడి ఫోన్​ చేస్తే పోలీస్​స్టేషన్​కు రమ్మని చెప్పాడు. కాసేపటికి పోలీస్​ స్టేషన్​ నుంచి ఫోన్​ వచ్చింది. మందు తాగాడు తీసుకెళ్లండని పోలీసులు ఫోన్​ చేశారు. మేము వచ్చేసరికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే స్పృహలో లేడు.'

- మృతుడి భార్య

ఇదీ చూడండి: FAKE DOCTORS: జనం నాడి పట్టారు.. జనరల్ ఫిజీషియన్ అవతారమెత్తారు!

Last Updated :Jul 16, 2021, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.