ETV Bharat / city

ప్రయాణికుల లగేజీతో ఉడాయించిన డ్రైవర్​ దొరికాడు.. బస్సు ఓనర్లే...

author img

By

Published : Nov 11, 2021, 4:35 PM IST

praivate-bus-driver-caught-who-escaped-with-passengers-luggage
praivate-bus-driver-caught-who-escaped-with-passengers-luggage

కేరళ నుంచి అసోంకు వెళ్తున్న ప్రైవేటు బస్సులోని ప్రయాణికుల సామాన్లు, డబ్బులతో పరారైన డ్రైవర్​(private bus driver escape) పోలీసులకు దొరికిపోయాడు. ఈ నెల 5న ఉడాయించిన డ్రైవర్​, క్లీనర్​.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.​ వారి నుంచి ప్రయాణికులు లగేజీతో పాటు 18 సెల్​ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రయాణికుల సామాన్లతో ఈ నెల 5న పరారైన ప్రైవేట్​ బస్సు డ్రైవర్​(private bus driver escape)ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బస్సు ఓనర్లే దొంగలుగా పోలీసులు తేల్చారు. బస్సు డ్రైవర్, క్లీనర్ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ప్రయాణికుల లగేజీ, బస్సు, 18 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు.. కేరళ వరకు వెళ్లి మరీ నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ముందుగానే అనుకుని..

"కేరళలో పని చేసే వలస కూలీలు(migrant workers) స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇద్దరు టూరిస్ట్ ఏజెంట్లతో మాట్లాడి.. వారి ద్వారా ఒక ట్రావెల్ బస్సు(private travels bus) మాట్లాడుకున్నారు. మనిషికి రూ.3500 చొప్పున ఇస్తామని చెప్పగా ఒప్పుకున్నారు. మొత్తం రెండు లక్షల ఇరవై వేలు. ఈ నగదుతో బస్సు ఓనర్లు సంతృప్తి పళ్లేదు. అంత దూరం వెళ్తే.. తమకు ఏమీ లాభం లేదనుకున్నారు. కూలీలను మధ్యలోనే వదిలేయాలని మోసపూరిత ఆలోచన చేశారు. బస్సు ఓనర్లు అనుకున్నట్టే కూలీలను.. ఎన్​హెచ్​-65 జాతీయ రహదారిపై నార్కట్​పల్లి శివారులో భోజనం చేయండని దింపారు. ప్రయాణికులు లగేజీతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన మా పోలీసులు... నార్కట్​పల్లి సీఐ శంకర్ రెడ్డి, ఎస్సై యాదయ్య.. కేరళ వెళ్లారు. నిందితులను గుర్తించి... వారిని నార్కట్​పల్లికి తరలించారు." - వెంకటేశ్వర్​రెడ్డి, డీఎస్పీ

అసలేమైందంటే..

కేరళలో పనులు చేసుకొని పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లాలనుకున్నారు ఆ వలస కూలీలు(migrant workers). వారంతా... బిహార్, బెంగాల్, నేపాల్, అసోంకు చెందినవారు. ఏజెంట్‌ ద్వారా ఒక్కొక్కరు 3 వేల 500 రూపాయలు చెల్లించి ప్రైవెేటు ట్రావెల్స్​లో బస్సు టికెట్లు బుక్(private bus ticket booking)​ చేసుకున్నారు. ఈ నెల 3 తారీఖున కేరళ నుంచి అస్సాంకు 64 మంది ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్​కు చెందిన బస్సు(private travels bus) బయలుదేరింది. రెండు రోజుల ప్రయాణం తర్వాత.. 5న నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి బస్సు చేరుకుంది. నార్కట్​పల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద అల్పాహారం కోసం బస్సును ఆపారు. ప్రయాణికులంతా తినేందుకు కిందకు దిగారు. ఇదే అదునుగా భావించిన డ్రైవర్‌, క్లీనర్‌... ప్రయాణికుల లగేజీతో(private bus driver escape) ఉడాయించారు. తమ బస్సెక్కిన ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన బాధ్యతను విస్మరించి.. మధ్యలోనే వదిలటమే కాకుండా.. ఆ కూలీలు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు, సామాన్లతో ఉడాయించారు.

డబ్బులు పోవటం వల్ల..

బస్సులో సామాన్లు, డబ్బులు పోవడంతో ఆ ప్రయాణికులకు ఏం చేయాలో తోచలేదు. నిస్సహాయంగా రోడ్డుపై నిలబడిపోయారు. వెంటనే నార్కట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం వల్ల డ్రైవర్​ను పట్టుకోవటం పోలీసులకు సమస్యగా మారింది. బాధితులందరికి తాత్కాలికంగా నార్కట్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌ హాలులో రాత్రి బసకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. బస్‌ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.