ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 1PM

author img

By

Published : Aug 8, 2022, 12:59 PM IST

Telangana News Today
Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు శ్రీకారం

Independence day diamond jubilee in Telangana : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్​లోని హెచ్​ఐసీసీలో ఘనంగా ప్రారంభించారు. హెచ్​ఐసీసీకి చేరుకున్న కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు.

  • రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన స్పీకర్​

MLA Rajagopal reddy resignation : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు తన రాజీనామాను తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి సమర్పించారు. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి సమర్పించిన లేఖను స్పీకర్ ఆమోదించారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి స్వయంగా వెల్లడించారు. అసెంబ్లీకి వెళ్లేముందు రాజగోపాల్ రెడ్డి గన్​పార్కు వద్ద అమరవీరు స్థూపానికి నివాళులర్పించారు.

  • వెంకయ్య సాక్షిగా అనేక చారిత్రక ఘటనలు

ఉపరాష్ట్రపతి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న వెంకయ్య నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అయితే, దేశ ప్రజలకు వెంకయ్య నాయుడి అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.

  • 'అవి' చూపించాడని రహస్య భాగాలపై పెట్రోల్ పోసి..

మహిళల ముందు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

  • బ్యాంకు ఖాతాలోకి రూ.6,833 కోట్లు.. అధికారుల మౌనం

ఓ వ్యక్తి ఖాతాలోకి రూ.6వేల కోట్లకు పైగా నగదు క్రెడిట్ అయింది. ఈ డబ్బు ఎలా వచ్చిందో? ఎవరు పంపించారో తెలీదు! వారం క్రితం డబ్బులు వచ్చినట్లు తెలుస్తుండగా.. ఇప్పటికీ నగదు ఆ ఖాతాలోనే ఉంది. అసలేమైంది?

  • వానొచ్చిందంటే 'తాడు'తోనే వారి ప్రయాణం

Live Video : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాంకిడి మండలం పిప్పర్​గొండి గ్రామానికి వర్షాకాలం వచ్చిందంటే మధ్యలో ఉన్న వాగు ఉప్పొంగడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వంతెన లేక, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వాగుకు రెండు వైపులా తాడు కట్టి దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • మొదటి భార్య సమాధి వద్ద ఆత్మహత్య

Husband commits suicide at first wife's grave: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. అంతలోనే విధికి కన్నుకుట్టిందో ఏమో.. భార్యను ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోయాడు. దాంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. కుమారుడిని అలా చూడలేకపోయిన తల్లిదండ్రులు అతడికి నచ్చజెప్పి.. రెండో పెళ్లి చేశారు. అయినా మొదటి భార్యను మర్చిపోలేక ఆమె సమాధి వద్దే పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

  • స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి

Gold Price Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • రోహిత్​సేన చేసిన పనికి ఫ్యాన్స్​ షాక్​!

కామన్వెల్త్​ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళల క్రికెట్​ జట్టు​.. తొలి మ్యాచ్ నుంచి ఫైనల్‌ వరకు అద్భుత ప్రదర్శనను కనబరిచింది. ఫైనల్​లో ఓడినా క్రికెట్‌ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అయితే వీరు తుది పోరు ఆడుతున్న సమయంలో రోహిత్​ సేన చేసిన ఓ పని నెటిజన్లను ఆకర్షించింది. అదేంటంటే...

  • ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ ఘనత

నందమూరి హీరోలు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తెలుగు ఇండస్ట్రీలో ఓ ఘనత సాధించారు. సినిమా సినిమాకు వీరు చేస్తున్న ప్రయోగాల వల్ల టాలీవుడ్​కు స్టార్ డైరెక్టర్లు దొరుకుతున్నారు. వీరి సినిమాలతో వచ్చిన దర్శకులు ప్రస్తుతం బడా హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్​లో కొనసాగుతున్నారు. ఆ సంగతులేంటో తెలుసుకుందాం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.