ETV Bharat / city

విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్, ఈసెట్​ తాజా షెడ్యూలు విడుదల..

author img

By

Published : Jul 19, 2022, 2:23 PM IST

Updated : Jul 19, 2022, 2:56 PM IST

The schedule of the postponed entrance exams has been finalized in telangana
విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30, 31న ఎంసెట్ అగ్రికల్చర్

14:21 July 19

వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఖరారు

Entrance Tests New Schedule: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల దృష్ట్యా వాయిదా పడిన ప్రవేశ పరీక్షల తాజా షెడ్యూల్​ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల్లో ఎంసెట్​, ఈసెట్​, పీజీఈసెట్​.. ఉండగా వాటి షెడ్యూల్​ను ఖరారు చేసింది. ఈ నెల 30, 31న ఎంసెట్ (అగ్రికల్చర్)ను నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఈసెట్​ ను ఆగస్టు 1న, పీజీఈసెట్​ను ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

ఎడతెరపి లేకుండా కొనసాగిన వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం మొదట మూడు రోజులు సెలవులు ప్రకటించటంతో.. జులై 13న నిర్వహించాల్సిన ఈసెట్​ను అధికారులు వాయిదా వేశారు. మిగతా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపారు. అయితే... జులై 14, 15న భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆ సెలవులు కాస్తా మరో మూడు రోజులు కొనసాగాయి. ఫలితంగా.. ఆ రెండు రోజుల్లో జరగాల్సిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను విద్యామండలి వాయిదా వేసింది. కాగా.. 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ యథాతథంగా నిర్వహిస్తున్నారు.

వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూలు..

  • ఈనెల 30, 31న ఎంసెట్ (అగ్రికల్చర్)
  • ఆగస్టు 1న ఈసెట్: ఉన్నత విద్యామండలి
  • ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్

ఇవీ చూడండి:

Last Updated :Jul 19, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.