ETV Bharat / city

కడపలో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిని చితక్కొట్టిన స్థానికులు

author img

By

Published : Aug 18, 2022, 6:54 PM IST

Attack on secreteriate employees
Attack on secreteriate employees

Attack on secreteriate employees ఏపీలోని వైఎస్సార్ జిల్లా ఉక్కాయపల్లిలో సచివాలయ సిబ్బందిని స్థానికులు చితకబాదారు. నిర్మాణాలపై కోర్టు స్టే ఉన్నా.. కూల్చివేయడానికి వచ్చారంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సచివాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు.

Attack on secreteriate employees ఏపీలోని వైఎస్సార్ జిల్లా కడపలో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు వెళ్లిన నగరపాలక, సచివాలయ సిబ్బందిపై స్థానికులు దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా ఆక్రమణలను సిబ్బంది తొలగించేందుకు యత్నించారు. క్రాంతికుమార్‌ అనే వ్యక్తి ఇంటి ప్రహరీని కూల్చేందుకు సచివాలయ సిబ్బంది వచ్చారు. దీనిపై న్యాయస్థానంలో స్టే ఉందని చెప్పినా వినకుండా కూల్చేందుకు ప్రయత్నించడంతో ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ దౌర్జన్యంగా ఎలా కూలుస్తారంటూ సిబ్బందిని నిలదీశారు.

కడప నగరంలో అక్రమ ఇళ్ల నిర్మాణం కూల్చివేత ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవుని కడపకు వెళ్లే రహదారిలో బుక్కాయిపల్లి వద్ద ఓ ఇంటి నిర్మాణం అక్రమంగా చేపట్టారని రెవెన్యూ సచివాలయ సిబ్బంది కూల్చివేతకు ప్రయత్నించగా ఇంటి యజమానులు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై సచివాలయ సిబ్బంది టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య సాయి ప్రవచన్​ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

సచివాలయ సిబ్బందిని చితక్కొట్టిన స్థానికులు

అక్రమ నిర్మాణం చేపట్టిన ఇంటి వద్దకు చేరుకుని జేసీబీతో కూల్చి వేయించారు. తహశీల్దార్​ శివరామరెడ్డి కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మార్కింగ్ వేసిన ప్రాంతాన్ని మొత్తం అధికారులు జేసీబీతో కూల్చివేశారు. ఇంటిని కూడా కూల్చడానికి ఎక్కించగా ఇంటి యజమానులు వేడుకోవడంతో రాత్రి వరకు సమయం ఇచ్చారు. రేపు ఉదయంలోపు ఇల్లు ఖాళీ చేయకపోతే ఇంటిని మొత్తం కూల్చివేస్తామని కమిషనర్ హెచ్చరించారు. తమ సిబ్బందిపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునరావృతమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
ఇవీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో 435 గ్రాముల బంగారం పట్టివేత

డోలో 650 ప్రిస్క్రైబ్ చేసేందుకు వారికి రూ.వెయ్యి కోట్ల గిఫ్ట్స్​, సుప్రీం సీరియస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.